హైదరాబాద్, వెలుగు: పాలమూరు నిరు ద్యోగ మార్చ్‌లో తాను పాల్గొనకపోవడంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగ కార్యచరణ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా జరుగుతున్నట్లుగా తాను భావిస్తున్నట్లు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వరంగల్ తన సొంత జిల్లా అయినందునా అక్కడ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ గురించి పార్టీ సమాచారం ఇచ్చిందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా తన జిల్లా కానందునా అక్కడ నిర్వహించిన మార్చ్ గురించి సమాచారం ఇవ్వలేదని అనుకుంటున్నట్లు ఆమె వివరించారు. అంతకన్నా.. ఈ అంశంలో ప్రత్యేకించి ప్రస్తావించవలసిన సమస్య ఏమీ లేదని విజయశాంతి
పేర్కొన్నారు.