సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..

సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..

విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి రిమాండ్ కి తరలించారు పోలీసులు. తాజాగా నిందితుడు సతీష్ ను కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సతీష్ ను వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.

విజయవాడ కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులతో సతీష్ ఏప్రిల్ 27వ తేదీ వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు. అయితే, పోలీసుల విచారణలో నిందితుడిపై ఎట్టి పరిస్థితిలో థర్డ్ డిగ్రీ ఉపయోగించద్దని హెచ్చరించింది కోర్టు. విచారణ పూర్తైన తర్వాత నిర్దారణకు వచ్చిన అంశాలు కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది కోర్టు. మరి, A1గా ఉన్న సతీష్ పోలీసుల విచారణలో ఏ అంశాలు వెల్లడిస్తాడో వేచి చూడాలి.

Also Read:వైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..