రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ

రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనక దుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు. వామహస్తంలో చెరుకు గడను ధరించి, దక్షిణ హస్తంతో అభయ ముద్రతో.. శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తుల బారులు తీరారు.

దసరా  ఉత్సవాలు చివరి రోజు కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచి క్యూ లైన్ మార్గంలో ఉన్నా దర్శనం కావడంలేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ మార్గంలో చంటి పిల్లలకు పాలు కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలకు, పోలీసుల కుటుంబాలకు మాత్రమే అధికారులు అనుమతి ఇస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. రాజగోపురం వద్ద అరగంట నుంచి ట్రాఫిక్ జాం అయింది. భక్తులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.