షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు... మమ్మల్ని చూసి భయపడుతున్నారా సారూ...

షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు... మమ్మల్ని చూసి భయపడుతున్నారా సారూ...

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిబాధ్యతలు చేపట్టనున్న వేళ ఆమె కాన్వాయ్ ను ఆదివారం ( జనవరి 21)  పోలీసులు అడ్డుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఆమె గన్నవరం విమానాశ్రయానికి రాగా.. అక్కడి నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో షర్మిల ఏపీ కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎనికే పాడు వద్ద వాహనాలను పోలీసులు మళ్లించారు. వాహనాలను మళ్లించినందుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రోడ్డుమీద బైఠాయించారు.  వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. అందుకే తన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ‘భయపడుతున్నారా సార్’ అంటూ షర్మిల మాట్లాడారు.తమ కార్యకర్తల్ని అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. అవసరమైతే జైలుకైనా వెళ్తామని ఘాటుగా స్పందించారు వైఎస్ షర్మిల

 షర్మిల (Ys Sharmila ) వాహనాలను డైవర్ట్ చేసినందుకు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ ఇతర కాంగ్రెస్ శ్రేణులు. ...విజయవాడలో తన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ర్యాలీకి అనుమతి ఉన్నా కాన్వాయ్ ని ఆపడానికి ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. 'ఏపీ పీసీసీ చీఫ్ గా  షర్మిల  బాధ్యతలు తీసుకునే సమయంలో  కాన్వాయ్ ను అడ్డుకున్నారు.

ఏపీ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. పోలీసులు కావాలనే షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము ముందే రూట్ ప్లాన్ పోలీసులకు ఇచ్చామని.. అయినా పోలీసులు అడ్డంకులు పెడుతున్నారని అన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. తమ కాన్వాయ్ కు అనుమతి ఇవ్వకపోతే మొత్తం విజయవాడ మొత్తాన్ని బంద్ చేస్తామని గిడుగు రుద్రరాజు హెచ్చరిక చేశారు.