వికారాబాద్​ - రాయచూర్​ రైల్వే లైన్​ సర్వే షురూ

వికారాబాద్​ - రాయచూర్​ రైల్వే లైన్​ సర్వే షురూ

–కొడంగల్​, వెలుగు: వికారాబాద్​–- రాయచూర్​ రైల్వేలైన్​ సర్వే పనుల్లో వేగం పెరిగింది. కొడంగల్, పరిగి, మక్తల్, నారాయణపేట ప్రాంతాలకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల కంటే ముందే  ప్రాజెక్టు అభివృద్ధికి ప్లాన్ రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్​అరుణ్​ కుమార్​జైన్​కు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సూచించారు. నిర్లక్ష్యానికి గురైన వికారాబాద్​–- రాయచూర్​ రూట్ ను కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందని రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ రూట్ పూర్తయితే రవాణా వ్యవస్థ మెరుగవడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటవుతాయి. కొడంగల్, నారాయణపేట ప్రాంతాల్లో సున్నం, నాపరాయి నిక్షేపాలు పుష్కలంగా ఉండగా కొత్త పరిశ్రమల రాకతో..ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముందుగా వికారాబాద్​నుంచి కృష్ణ వరకు ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా రాయిచూర్​వరకు పొడిగించారు.  122 కిలోమీటర్లు, రూ.2,196 కోట్ల ఖర్చువికారాబాద్​– రాయచూర్​ కొత్త రైల్వే ప్రాజెక్టు 122 కిలోమీటర్ల సర్వేకు గత సెప్టెంబర్​ లో రైల్వే మంత్రిత్వ శాఖ జీవో నం. 418/2023-24 ద్వారా రూ. 2,196 కోట్లు మంజూరు చేస్తూ ఉతర్వులు జారీ చేసింది. తద్వారా ప్రాజెక్ట్ పూర్తయితే కొడంగల్​ప్రజలు కల తీరనుంది.