బడి పిల్లలందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను అందించాలని కలెక్టర్ ఆదేశం

బడి పిల్లలందరికీ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను అందించాలని కలెక్టర్ ఆదేశం

వికారాబాద్, వెలుగు: నులి పురుగుల నివారణ ట్యాబ్లెట్ల(ఆల్బెండజోల్)ను స్కూల్ పిల్లలందరికీ అందించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుదవారం కలెక్టరేట్​లోని ఆయన చాంబర్ లో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 12న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని స్కూల్స్, వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్లకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 19లోగా వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో పాల్వన్ కుమార్, డీఈవో రేణుకా దేవి, వెల్ఫేర్ ఆఫీసర్ లలిత కుమారి, మెప్మా పీడీ రవి కుమార్ అధికారులు పాల్గొన్నారు.