- పోలీసులకు ఫిర్యాదు
వికారాబాద్, వెలుగు : జూనియర్డాక్టర్లు పట్టించుకోకపోవడంతో తమ ఐదు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వికారాబాద్ లోని మహావీర్ హాస్పిటల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువులు నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని మీనపల్లి కలాన్ గ్రామానికి చెందిన జోగు మధుకర్, మౌనిక దంపతులకు ఐదు నెలల కూతురు ఉంది.
ఆదివారం రాత్రి తీవ్రమైన జ్వరం రావడంతో మహావీర్ దవాఖానకు తీసుకువచ్చారు. సీనియర్డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో జూనియర్డాక్టర్లు పట్టించుకోలేదని, ఫోన్లు చూస్తూ ట్రీట్మెంట్చేయడంతో వారి నిర్లక్ష్యానికి తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు. డాక్టర్లపై చర్య తీసుకోవాలని హాస్పిటల్ఎదుట నిరసనకు దిగారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ర్ట కార్యదర్శి గీత, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్, కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుకుమార్ తెలిపారు.
