నవంబర్ 28న దివ్యాంగులకు క్రీడా పోటీలు

నవంబర్ 28న దివ్యాంగులకు క్రీడా పోటీలు

వికారాబాద్​, వెలుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలో ఈ నెల 28న జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.కృష్ణవేణి బుధవారం ప్రకటించారు. 

రన్నింగ్, షాట్ ఫుట్, చెస్, రన్నింగ్, జావెలిన్ త్రో, క్యారం వంటి క్రీడలు ఉంటాయని పేర్కొన్నారు. వికారాబాద్ లోని బ్లాక్ గ్రౌండ్ స్టేడియంలో క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన దివ్యాంగులు 81794 32874, 90007 78300 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.