బాలల హక్కుల రక్షణకు బాల అదాలత్​ : సీతా దయాకర్ రెడ్డి

బాలల హక్కుల రక్షణకు బాల అదాలత్​ : సీతా దయాకర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు: బాల్య వివాహాలపై మారుమూల గ్రామాల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో బాల అదాలత్ కార్యక్రమాన్ని జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్​పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. గురువారం మహిళా,  శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ మూడో వారంలో బాల అదాలత్ ఉంటుందని, అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బొంరాస్ పేట మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేశామని, వైకల్యం గల పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. పోక్సో, బాల్య వివాహ బాధిత బాలికలకు ప్రత్యేక వసతి కల్పించాలన్నారు. కమిషన్ సభ్యులు అపర్ణ, చందన, సరిత, వచన్ కుమార్, వందనగౌడ్, ప్రేమలత అగర్వాల్, అడిషనల్​కలెక్టర్ సుధీర్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేశం, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.