ప్రభుత్వ ఆస్పత్రిలో సెల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ టార్చ్‌‌‌‌‌‌‌‌  వెలుగులో ట్రీట్‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌.. వికారాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఘటన

 ప్రభుత్వ ఆస్పత్రిలో సెల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ టార్చ్‌‌‌‌‌‌‌‌  వెలుగులో ట్రీట్‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌.. వికారాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఘటన

వికారాబాద్, వెలుగు : వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో గురువారం రాత్రి విద్యుత్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం, జనరేటర్‌‌‌‌‌‌‌‌ ఉన్న అందులో డీజిల్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో రోగులు, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ టార్చ్‌‌‌‌‌‌‌‌ వెలుగులోనే డాక్టర్లు రోగులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు ప్రతి రోజు సుమారు 800 మంది వరకు రోగులు వస్తుంటారు. గురువారం రాత్రి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ ఉన్న ప్రాంతంలో విద్యుత్‌‌‌‌‌‌‌‌ సరఫరాలో అంతరాయం తలెత్తింది. మూడు, నాలుగు గంటల పాటు విద్యుత్‌‌‌‌‌‌‌‌ రాకపోవడం, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో జనరేటర్‌‌‌‌‌‌‌‌ ఉన్నా అందులో డీజిల్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక తప్పని పరిస్థితుల్లో డాక్టర్లు, సిబ్బంది తమ సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లలో టార్చ్‌‌‌‌‌‌‌‌లైట్లు ఆన్‌‌‌‌‌‌‌‌ చేసుకొని రోగులకు వైద్య సేవలు అందించారు.