తాండూరు, వెలుగు: ముద్రా లోన్ పేరుతో ఓ సామాన్యుడిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని బండమీదిపల్లికి చెందిన దుబ్బాని శేఖర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది.
రూ.5 లక్షల ముద్రాలోన్ మంజూరు అయ్యిందని నమ్మించడంతో తన మొబైల్‌కు వచ్చిన ఓటీపీ వివరాలను వారితో పంచుకున్నాడు. దీంతో క్షణాల్లోనే అతని ఖాతా నుంచి నాలుగు విడతలుగా మొత్తం రూ. 45,065 డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
