ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు: వికాస్ రాజ్

ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు: వికాస్ రాజ్

మునుగోడు ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఫలితాల తారుమారు కోసమే వెట్ సైట్‭లో పెట్టడం లేదని ఆయన చెప్పారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మనకు ఎక్కువ సమయం పడుతోందని... అభ్యర్థులు ఎక్కువగా ఉండటం వల్లే ఇలా జరుగుతోందని వివరణ ఇచ్చారు. వేరే రాష్ట్రాలలో అభ్యర్థులు.. ఐదు, ఆరుగురు మాత్రమే ఉన్నారని.. మన దగ్గర 47 మంది ఉన్నారని తెలిపారు. అందరికీ ఎంట్రీ చేయాలి అంటే సమయం పడుతుందని ఆయన చెప్పారు. 

కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందని వికాస్ రాజ్ వెల్లడించారు. ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై అందరికి సమాచారం ఇస్తు్న్నామని చెప్పారు డేటాను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అబ్జార్వర్ మొత్తం ప్రక్రియ పట్ల సంతృప్తిగా ఉన్నప్పుడే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే... ప్రతి రౌండ్ కు అరగంట కంటే ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. ఇదిలా ఉంటే.. 4వ రౌండ్ రీకౌంటింగ్ అనే దానిపై తనకు ఇంకా సమాచారం రాలేదన్నారు. రీ కౌంటింగ్ పై ఆర్వో, అబ్జర్వర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కౌంటింగ్ మొత్తం పూర్తయ్యే సరికి ఇంకా 5 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.