Thangalaan: తంగలాన్‌ రిలీజ్ అప్పుడే ..అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్‌ పా.రంజిత్‌

Thangalaan: తంగలాన్‌ రిలీజ్ అప్పుడే ..అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్‌ పా.రంజిత్‌

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా పా.రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తంగలాన్‌ (Thangalaan) అనే సినిమా చేస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది.

విక్రమ్కు ఇది 61వ మూవీ. స్టూడియో గ్రీన్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ (MalavikaMohanan)గా కనిపించనుంది.

ఈ మూవీ జనవరి 26న రిలీజ్ అవుతుందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదాపడుతూనే వస్తుండటంతో చియన్స్ ఫ్యాన్స్ నుండి ప్రెషర్ పెరుగుతూ వస్తుంది. దీంతో ఈ సినిమా డైరెక్టర్ పా.రంజిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిలీజ్‌ గురించి మాట్లాడారు. 

‘‘ఈ సినిమా విరిలీజ్ కు సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.సెన్సార్‌ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తున్నాం. ప్రస్తుతం ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత  తంగలాన్‌ మూవీ రిలీజ్ చేస్తాం.ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని పా.రంజిత్‌ వెల్లడించారు.

ఈ  మూవీలో పార్వతి ముఖ్య పాత్రలో నటిస్తుండగా..మరో  కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్ నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.