లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన విలేజ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ

లంచం తీసుకుంటూ..  ఏసీబీకి చిక్కిన విలేజ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ

 రఘునాథపల్లి, వెలుగు : చేసిన పనికి క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని అడిగినందుకు లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఓ విలేజ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ గవ్వాని విజయ నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు గతంలో పనులు అభివృద్ధి పనులు చేశారు. వాటికి సంబంధించి రూ. 1.50 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. ఈ పనులకు బిల్లులు చేయాలని విజయ భర్త నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు విలేజ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ శివాజీని అడిగాడు. 

ఇందుకు రూ. 20 వేలు ఇవ్వాలని శివాజీ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో నాగేశ్వ్‌‌‌‌‌‌‌‌రరావు ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న శివాజీకి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ ఆఫీసర్లు శివాజీని రెడ్‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సారయ్య, సీఐలు ఎస్‌‌‌‌‌‌‌‌. రాజు, ఎల్‌‌‌‌‌‌‌‌. రాజు ఉన్నారు.