రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్ విధించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో.. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని హోటల్ యజమానికి స్థానిక తహశీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి వెయ్యి రూపాయల ఫైన్ విధించారు.
