‘ఫించన్’ కోసం వాగు దాటి వచ్చారు..

‘ఫించన్’ కోసం వాగు దాటి వచ్చారు..

కాగ జ్ నగర్, వెలుగు: అవసరం ఆపదను లెక్క చేయదంటారు. ఉధృతంగా పారుతున్న వాగును దాటి మరీ మండల కేంద్రానికి వచ్చి ఆసరా ఫించన్ తీసుకుని వెళ్లారు. సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా బెజ్జూర్ మండలంలోని చిన్న సిద్ధాపూర్ , పెద్ద సిద్ధాపూర్ లకు చెందిన 36 మంది లబ్ధిదారులు మండల కేంద్రానికి వచ్చారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున బీపీఎం బెజ్జూరులోనే కౌంటర్ ఏర్పాటు చేశారు. దీంతో పెన్షనర్లు మత్తడి వాగు దాటి మూడు కిలోమీటర్లు కలినడకన, ఎడ్లబండి మీద వచ్చారు. పింఛన్ తీసుకొని మళ్లీ వాగు దాటి ఇంటికి వెళ్లారు.