రోడ్డు నిర్మించడం లేదని ఎడ్ల బండ్లతో గ్రామస్తుల ధర్నా

రోడ్డు నిర్మించడం లేదని ఎడ్ల బండ్లతో గ్రామస్తుల ధర్నా

ఆసిఫాబాద్, వెలుగు : రెండేండ్లుగా రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు గురువారం రోడ్డు మీద ఎడ్ల బండ్లు , ట్రాక్టర్లు పెట్టి నిరసనకు దిగారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ ​జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి ఖమాన వరకు రోడ్డు నిర్మాణం కోసం గత గవర్నమెంట్ రూ.కోటి 50 లక్షలు మంజూరు చేసింది. రెండేండ్ల క్రితం కాంట్రాక్టర్​పనులు మొదలు పెట్టినా ఇంకా పూర్తి చేయలేదు. పనులు త్వరగా కంప్లీట్​చేయాలని అధికారులు, లీడర్లకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు.

దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మూకుమ్మడిగా రోడ్డు మీదకు చేరి రెండు వైపులా ఎడ్లబండ్లు ,ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి ధర్నా చేశారు. రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు కంప్లీట్ చేయాలని డిమాండ్​ చేశారు.