
హనుమకొండ జిల్లా పసరగొండలో వరదనీటిలో కొట్టుకుపోయిన విద్యార్థులను కాపాడారు గ్రామస్తులు. ఎడతెరిపి లేని వర్షాలతో పసరగొండ లో లెవల్ బ్రిడ్జిపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో..వంతెన దాటే ప్రయత్నంలో విద్యార్థులు కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న పొదల్లో చిక్కుకున్నారు. విద్యార్థులు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు తాడు సహాయంతో కాపాడారు.