‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫిబ్రవరి 17న విడుదల

‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫిబ్రవరి 17న విడుదల

కిరణ్ అబ్బవరం హీరోగా మురళీ కిశోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కశ్మీర పర్దేశీ హీరోయిన్. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుంది. తిరుమల తిరుపతి బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి ఆల్రెడీ టీజర్, రెండు పాటలను రిలీజ్ చేసిన టీమ్.. ఆదివారం ‘దర్శన’ అంటూ మూడో పాటను విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్‌‌‌‌‌‌‌‌ను అనురాగ్ కులకర్ణి అందంగా పాడాడు.

‘మనసే మనసే తననే కలిసే.. అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా.. తనతో నడిచే అడుగే మురిసే.. తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా’ అంటూ మొదలైన బ్రేకప్ సాంగ్‌‌‌‌‌‌‌‌కు భాస్కర భట్ల రవికుమార్ క్యాచీ లిరిక్స్ రాశారు.  ‘ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండె లోతుల్లో.. అన్ని పంచేసుకుందామంటే కళ్ల ముందు లేదాయే.. దర్శన.. దర్శన.. తన దర్శనానికి ఇంకా ఏన్నాళ్లు కన్నీళ్లతో ఉండాలిలా.. తట్టుకోవడం కాదే పిల్ల నావల్లా  వయ్యారి, గుక్కపట్టి ఏడుస్తుందే నా ప్రాణం నీవల్లా’ అంటూ యూత్‌‌‌‌‌‌‌‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్న పాటలో కిరణ్​ సింపుల్ స్టెప్స్‌‌‌‌‌‌‌‌ వేస్తూ కనిపించాడు.