Weekend OTT Releases: థియేటర్ టూ ఓటీటీ.. మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. 32 చిత్రాలు రిలీజ్!

Weekend OTT  Releases: థియేటర్ టూ ఓటీటీ.. మూవీ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. 32 చిత్రాలు రిలీజ్!

సంక్రాంతి పండగ కానుకగా సినిమాలు క్యూ కట్టాయి. థియేటర్లు, ఓటీటీలో సినీ ప్రియులకు వినోదాల జాతర మొదలైపోయింది. ఒకవైపు థియేటర్లలో 'రెబల్ స్టార్' ప్రభాస్ తన రాజసాన్ని చూపిస్తున్నారు. అటు బాక్సాఫీస్ వద్ద తన మాస్ మార్క్ ను చూపించేందుకు మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యారు. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏకంగా 28 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పోటీ పడుతున్నాయి. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమా చూడాలి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేద్దాం!

థియేటర్లలో 'రాజా సాబ్' హవా..

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన హారర్-కామెడీ 'ది రాజా సాబ్' జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్ వింటేజ్ లుక్స్, కామెడీ టైమింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నా..  సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. కథలో బలం తగ్గినా.. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు తిరగరాసింది.

 

మెగా మాస్ ఎంటర్టైనర్..

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11న స్పెషల్‌ ప్రీమియర్‌ షోలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.  ఇందులో వెంకటేష్ కూడా కీలక పాత్రలో ఉండటంతో మెగా, వెంకీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మాస్ రాజా సందడి

సంక్రాంతి రేసులో తన స్పీడ్ చూపిస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న వస్తోంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  రవితేజ ఎనర్జీ, కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాను విన్నర్‌గా నిలబెడతాయని చిత్రయూనిట్ ధీమాగా ఉంది.

 

 నవీన్ పోలిశెట్టి కామెడీ ధమాకా

యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో జనవరి 14న బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించడానికి సిద్ధమయ్యారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ చేస్తున్న పూర్తిస్థాయి కామెడీ కావడంతో, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

 

'నారీ నారీ నడుమ మురారి'

 వీటితో పాటు శర్వానంద్ హీరోగా, సంయుక్త , సాక్షి వైద్య కీలక పాత్రలో నటించిన  'నారీ నారీ నడుమ మురారి'  మూవీ కూడా జనవరి 14న రిలీజ్ కానుంది.  సంక్రాంతి వినోదాన్ని పంచడానికి రెడీ అయ్యాయి.  రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోంది. మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్‌కు ఒక భారీ పండుగ కాబోతోంది. 


ఓటీటీలో 'జై బాలయ్య' గర్జన!

ఈ వీకెండ్ ఓటీటీలో బిగ్గెస్ట్ అట్రాక్షన్ 'అఖండ 2'. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ భారీ సీక్వెల్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ గర్జన చేస్తోంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని 'అఘోరా' విశ్వరూపాన్ని చూడొచ్చు. ఇది తెలుగుతో పాటు ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.

 

నెట్‌ఫ్లిక్స్ (Netflix)


అఖండ 2: హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా (తెలుగు).

దే దే ప్యార్ దే 2: అజయ్ దేవగన్ రొమాంటిక్ కామెడీ (హిందీ).

హిస్ & హర్స్: ఆసక్తికరమైన మిస్టరీ సిరీస్ (తెలుగు డబ్బింగ్).

షిబోయుగీ: థ్రిల్లింగ్ జపనీస్ డెత్ గేమ్ మూవీ.

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime)

జిగ్రీస్: గోవా ట్రిప్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ కామెడీ (తెలుగు).

అందెల రవమిది: క్లాసిక్ టచ్ ఉన్న తెలుగు చిత్రం.

దండోరా (Jan 14): సామాజిక అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రాబోతోంది.

బిన్నీ అండ్ ఫ్యామిలీ: ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా (హిందీ).

 

ఆహా (Aha)

అయలాన్: శివకార్తికేయన్ ఏలియన్ మూవీ.. ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. సైన్స్ ఫిక్షన్ ప్రియులకు ఇది బెస్ట్ ఛాయిస్.

 

హాట్‌స్టార్ & సోనీ లివ్

వెపన్స్ (Hotstar): వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ (తెలుగులోనూ ఉంది).

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ S2 (SonyLiv): చరిత్రను ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

 

ఈటీవీ విన్ (ETV Win)

కానిస్టేబుల్ కనకం (S2): వర్ష బొల్లమ్మ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.

మళ్ళీ వచ్చిన వసంతం: ఒక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.

 

డాక్యుమెంటరీ ప్రియుల కోసం..

సన్ నెక్స్ట్‌ (Sun NXT) లో స్ట్రీమింగ్ అవుతున్న 'సైలెంట్ స్క్రీమ్స్' తప్పక చూడాల్సిన డాక్యుమెంటరీ. తెలంగాణలో అదృశ్యమవుతున్న అమ్మాయిల యదార్థ గాథల ఆధారంగా దీనిని రూపొందించారు.

మొత్తానికి, థియేటర్లో 'రాజా సాబ్' మాస్ రచ్చ చేస్తుంటే, ఓటీటీలో బాలయ్య యాక్షన్, శివకార్తికేయన్ ఫాంటసీ,, బోలెడన్ని థ్రిల్లర్స్ ఈ వీకెండ్‌ను కలర్‌ఫుల్‌గా మార్చేస్తున్నాయి. మీకు నచ్చిన జోనర్ ఏదో సెలెక్ట్ చేసుకుని చూసేయండి మరి!