Jayakrishna: ఘట్టమనేని వారసుడు వచ్చేశాడు.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

Jayakrishna: ఘట్టమనేని వారసుడు వచ్చేశాడు.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన  మహేష్ బాబు

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'అర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో జయ కృష్ణ హీరోగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తదానీ హీరోయిన్ గా నటిస్తోంది. 

కొన్ని రోజులక్రితమే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.. ఇప్పుడు మహేశ్ చేతుల మీదుగానే ఫస్ట్ బుక్ రిలీజ్ చేశారు. బైక్ పై వెళ్తూ కాస్త వంగి తుపాకీతో కాలుసున్నట్లుగా ఉన్న ఈ స్టార్ కిడ్ లుక్ అదిరిపోయింది.  ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక లవ్ అండ్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తుండగా... అశ్వనీద త్ సమర్పిస్తున్నాడు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అలాగే ఘట్టమనేని ప్యామిలీ నుంచి జయకృష్ణతో పాటు. మహేశ్ కొదుకు గౌతమ్. కూతురు సితార అలానే రమేశ్ బాబు కూతురు భారతి. మహేశ్ సోదరి మంజుల కుమార్తె జాన్వీ కూడా త్వరలో తెరంగేట్రం చేయనున్నారు.  ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా మూవీ టీంకు మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.