
నేడు వినాయక చవితి సందర్భంగా మంగళవారం మార్కెట్లు సందడిగా మారాయి. నవరాత్రులు పూజలు అందుకునేందుకు గణనాథుడు తీరొక్క అకృతుల్లో బుధవారం కొలువుదీరనున్నాడు. అందుకు మంగళవారం ఖమ్మం నగరంతో పాటు పలు పట్టణాల్లో వినాయక విగ్రహాలు, పూజ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, రోడ్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. – వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం