వినోద్ కాంబ్లీకి రూ. లక్షతో కూడిన ఉద్యోగం ఆఫర్

వినోద్ కాంబ్లీకి రూ. లక్షతో కూడిన ఉద్యోగం ఆఫర్


ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఓ వ్యాపారవేత్త బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నెలకు లక్ష రూపాయల శాలరీతో ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు. క్రికెట్కు సంబంధించింది కాదు..ఫైనాన్స్ రంగానికి చెందిన ఉద్యోగం. మహారాష్ట్రకు చెందిన వ్యాపార వేత్త సందీప్‌ తోరట్‌వినోద్ కాంబ్లీకి ఈ ఉద్యోగాన్ని ఇస్తానని ముందుకొచ్చారు. నెలకు లక్ష రూపాయలు వేతనం చెల్లిస్తానని తెలిపారు. 

రికార్డుల మోత...
స్కూల్ క్రికెట్ లో లెజెండ్ సచిన్ తో కలిసి కాంబ్లీ రికార్డుల మోత మోగించాడు. ఆ తర్వాత టీమిండియాకు ఎంపికయ్యాడు. అరంగేట్రంలోనే డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటు ఆటపై దృష్టి పెట్టలేదు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు. భారత్ తరపున వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 

పింఛనే ఆధారం..
క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక..వినోద్ కాంబ్లీ ఏ రంగాన్ని కూడా ఎంచుకోలేదు. బీసీసీఐ ఇచ్చే పింఛన్పైనే ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే ఈ పింఛన్తో కుటుంబ పోషించలేకపోతున్నానని ఓ ఇంటర్య్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన సహచర క్రికెటర్ సచిన్ ఓ క్రికెట్ అకాడమీలో కోచ్గా ఉద్యోగం ఇప్పించినా..సుదూరం ప్రయాణం కారణంగా మానేశానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే సచిన్ ఎంతో సాయం చేశాడని..మరోసారి అతన్ని అడిగి ఇబ్బంది పెట్టలేనన్నాడు. ఎంసీఏలో కోచ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నానని..ఎంసీఏ సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.