లా కమిషన్‌ చైర్మన్‌ రితురాజ్‌ అవస్థికు వినోద్‌ కుమార్‌ లేఖ

లా కమిషన్‌ చైర్మన్‌ రితురాజ్‌ అవస్థికు వినోద్‌ కుమార్‌ లేఖ

హైదరాబాద్‌, వెలుగు : గవర్నర్ల తీరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200లో సవరణలు చేయాలని ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కోరారు. లా కమిషన్‌ చైర్మన్‌ రితురాజ్‌ అవస్థికి ఆయన బుధవారం లేఖ రాశారు. ఆర్టికల్‌ 200లోని ‘యాస్ సూన్ యాస్  పాసిబుల్‌’ అనే పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారన్నారు.

యాస్ సూన్ యాస్ పాసిబుల్​ను ‘వితిన్‌ 30 డేస్‌’గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ పదం మార్పుతో గవర్నర్లు ఆయా బిల్లులను నిర్ణీత గడువులోగా క్లియర్‌ చేయడమో లేదా తిరస్కరించడమో జరుగుతుందని, అది కూడా జరగకపోతే రాష్ట్రపతి పరిశీలనకు పంపే అవకాశం ఉంటుందన్నారు.