టాలీవుడ్ ఐకాన్ కపుల్ గా అక్కినేని నాగార్జున, అమలకు పెట్టిందిపేరు. వీరి వ్యక్తిగత జీవితం, వారి పిల్లలు నాగచైతన్య, అఖిల్, కోడళ్లతో ఉన్న అనుబంధం గురించి ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరంగా ఉంటుంది. లేటెస్ట్ గా అమల ఒక ఇంటర్యూలో నాగచైతన్యతో తనకు తొలి రోజుల్లో ఉన్న బంధం గురించి, అది కాలక్రమేణా ఎలా బలపడిందో వివరిస్తూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చైతూతో నా బంధం మొదలైంది అప్పుడే..
నాగచైతన్య చిన్నప్పుడు తన తల్లి లక్ష్మీ దగ్గుబాటితో కలిసి చైన్నైలో పెరిగారు. అయితే చైతూకు చిన్నతనంలో తాను ఎప్పుడూ టచ్ లో ఉన్నప్పటికీ .. హైదరాబాద్ లో కాలేజ్ చదువుల కోసం వచ్చిన తర్వాతే తమ మధ్య నిజమైన అనుబంధం మొదలైందని ఇంటర్యూలో అమల వెల్లడించారు. చైతన్య చెన్నైలో పెరగడం వలన, అతను కాలేజ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే నేను అతన్ని నిజంగా తెలుసుకోగలిగాను. అప్పటివరకు నేను అతనికి అందుబాటులో ఉన్నప్పటికీ, క్లోజ్‌గా ఉండే అవకాశం రాలేదు అని అమల అన్నారు.
చైతన్య చాలా మంచివ్యక్తి, వయసుకు మించిన పరిణతి, వివేకం అతనిలో ఉందని అమల ప్రశంసించారు. ఎప్పుడూ తప్పులు చేయలేదు, తన తండ్రి నాగార్జున చెప్పేది ఎప్పుడూ వింటాడు. తనకంటూ ఒక ప్లానింగ్, ఆలోచన ఎప్పుడూ ఉండేది. చాలా బాధ్యత గలవాడు అంటూ చైతన్యపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
స్వతంత్ర నిర్ణయాలే ముఖ్యం
అఖిల్‌పై తన ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అమల తెలిపారు. చిన్నవాడిని చాలా స్వతంత్రంగా పెంచాము. చిన్నప్పటి నుంచే వారి నిర్ణయాలను వారే తీసుకునేలా ప్రోత్సహించాం. కంచెపై కూర్చున్న పిల్లి'లా కాకుండా, తీసుకున్న నిర్ణయంతో ముందుకు సాగాలని నేర్పించాము అని అమల వివరించారు. ఈ స్వతంత్రత వలన వారు తమ విజయం, వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కోగలిగారు. మంచి చెడు రెండింటి నుంచీ నేర్చుకోగలిగారని అమల తెలిపారు. అక్కినేని కుటుంబం, ప్రేక్షకుల అపారమైన ప్రేమ, మద్దతు వారికీ ఎప్పుడూ తోడుగా నిలిచిందని ఆమె అన్నారు.
