ఇంటర్న్షిప్ అంటే ఏంటి.. ఒక వ్యక్తి ఆన్ టైమ్ ఎక్స్పీరియెన్స్ లేదా ఫీల్డ్ ఎక్స్పీరియెన్స్ కోసం ఏదైనా కంపెనీలో సొంత ఇంట్రెస్ట్ తో జాయిన్ అవ్వడం. షార్ట్ టైమ్ లో అంటే నెల లేదా మూడు నెలలు అలా అనుభవం కోసం కంపెనీ అనుమతిస్తే చేయడం. ఒకవేళ అభ్యర్థి పనితనం నచ్చితే కొన్నిసార్లు కంపెనీలు జాబ్ ఇచ్చి కంటిన్యూ చేస్తుంటాయి.
అయితే ఇలాంటి ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్స్ కోసం కంపెనీలు చాలా తక్కువ మొత్తంలో ఖర్చుల వరకు అన్నట్లుగా పే చేస్తుంటాయి. కానీ బెంగళూరుకు చెందిన కంపెనీ పేమెంట్ చూసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ.. నెల లక్ష రూపాయల ఇంటర్న్ షిప్ తో LinkedIn ప్రకటన ఇచ్చింది. టైమింగ్స్, శాలరీ షాకింగ్ కు గురిచేసేలా ఉండటంతో.. ఇది వెంటనే ఫుల్ వైరల్ గా మారింది.
జాబ్, సాలరీ, టైమింగ్స్..
ఆతిత్య ఠాకూర్ అనే వ్యక్తి స్క్రీన్ షాట్ తీసిన లింక్డిన్ పోస్ట్ ప్రస్తుతం ఫుల్ వైరల్ గా మారింది. శాన్ ఫ్రాస్కిస్కో కు చెందిన ఏఐ స్టార్టప్ కంపెనీ.. బెంగళూరు ఆఫీసులో పనిచేసేందుకు ఫౌండింగ్ ఇంజినీర్స్.. పేరిట ప్రకటన వెలువరించింది.
ఆఫర్ ఇలా ఉంది.
- ఇంటర్న్ షిప్ కోసం నెలకు రూ.లక్ష స్టైపెండ్
- ఫుల్ టైమ్ రోల్స్ కోసం రూ.30-60 లక్షలు
- ఫుడ్, జిమ్ ఫ్రీ
ఇన్ని ఆఫర్లు ఇచ్చినప్పటికీ నెటిజన్లను షాకింగ్ కు గురిచేసిన అంశాలు:
- వారానికి 6 రోజులు డ్యూటీ
- ఉదయం11.00 నుంచి రాత్రి 11.00 గంటల వరకు
- వారానికి 72 గంటల పని
ఏదైనా చేయగలను.. అనే యాటిట్యూడ్ ఉన్నవాళ్లకు, తమను తాము ప్రూవ్ చేసుకోవాలి అనే ఆరాటం ఉన్నవాళ్లకు ఈ జాబ్ సూటబుల్ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.
సోషల్ మీడియలో దుమారం:
కంపెనీ ఆఫర్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. 11 to 11.. ఇదేం కంపెనీరాబాబూ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెషర్ కు లక్ష శాలరీ అంటే మంచి ఆఫర్.. కానీ 6 రోజులకు 12 గంటల షిఫ్ట్ ..? నో థ్యాంక్స్.. అని మరొకరు షేర్ చేస్తున్నారు. ఇది ఇండియాలో జరిగేదేనా..? అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే కొందరు మాత్రం పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. హై శాలరీ కావాల్సిందే.. ఎందుకంటే బెంగళూరు ఎక్స్పెన్సివ్ సిటీ.. అంటూ రిప్లై ఇచ్చాడు.
కాకరేపిన కో-ఫౌండర్ కామెంట్:
యంగ్ ఇంజినీర్స్ కు ఈ ఆఫర్ చాలా రేర్ గా దొరికే చాన్స్ అని.. ఫార్చూన్-500 లిస్ట్ కంపెనీ ఫండ్ ఇచ్చే స్టార్టప్ ఇది అని చేసిన కామెంట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇవే:
- ఇండియా స్టార్టప్ వర్క్ కల్చర్ లో ఉన్న అసలు సమస్య ఇదే.
- ఎక్కువ పని వేళలు గ్రేట్ ప్రొడక్ట్స్ ను తయారు చేయలేవు. మంచి టీమ్ ఉండాలి అంతే.
- అవకాశం పేరుతో దోపిడీ చేయడం అంటే ఇదే.
