రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు

రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు

డెంగీ, మలేరియా  జ్వరాలు  జనాన్ని భయపెడుతున్నాయి. వర్షాలతో  వైరల్  ఫీవర్లు వణికిస్తున్నాయి. సర్కార్ ఆస్పత్రుల్లో  ఉదయం నుంచే  ఓపీ కౌంటర్ల  వద్ద  రద్దీ కనపడుతోంది.  రద్దీకి  తగ్గట్లు  సర్కార్  ఏర్పాట్లు చేయకపోవడంపై  పేషంట్లు  మండిపడుతున్నారు. సీజనల్  ఫీవర్స్  పెరగడంతో హైదరాబాద్  ఫీవర్ హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  స్వయంగా పరిశీలించారు.

ప్రధాన  హస్పిటల్స్ ఎక్కడా చూసిన పేషంట్ల రద్దీ కనిపిస్తుంది. హైద్రబాద్ లోని ఫీవర్ హాస్పటల్స్ లో కేవలం రెండు కౌంటర్స్ మాత్రమే ఉండటంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి నిలబడ లేక చిన్నారులు, వృద్దులు అస్వస్థతకు గురవుతున్నారు.  హస్పిటల్స్ కు వచ్చే  వారిలో అధికంగా మలేరియా, టైఫాయిడ్,  డెంగీ  కేసులే ఉంటున్నాయి. ల్యాబ్, ఫార్మసీ దగ్గర కూడ రద్దీ ఉండడంతో పేషంట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.