ఈ కుర్రోడు ఏంటీ ఇలా : మెట్రో రైళ్లల్లో సైకిళ్లు తీసుకెళ్లొచ్చా

ఈ కుర్రోడు ఏంటీ ఇలా : మెట్రో రైళ్లల్లో సైకిళ్లు తీసుకెళ్లొచ్చా

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ఎన్నో వింతలు విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ ఇలాంటి విశేషాలను చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ మాయలో మునిగి తేలుతున్నారు. పెద్దలు చిన్నలు అనే తేడా లేకుండా అందరూ కూడా సోషల్ మీడియా ప్రపంచంలోనే బ్రతికేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే సోషల్ మీడియా కొంతమందికి ఇలా ఎంటర్టైన్మెంట్ అందిస్తే ఇంకొంతమందికి మాత్రం ఆదాయాన్ని అందిస్తుంది అని చెప్పాలి.

 సైకిల్‌‌ను సామాన్యుడి వాహనమని అంటారు. సైకిల్‌పైనే ప్రయాణం కొనసాగిస్తూ అనేక పనులు పూర్తి చేస్తుంటారు చాలామంది. ఇటువంటి అవసరాల కోసమే కాకుండా సైకిల్‌‌ను ఆరోగ్య ప్రదాయినిగా వైద్యులు చెబుతుంటారు. సైకిళ్లను మనం రోడ్లపై, వీధుల్లో, పొలాల వద్ద చూస్తుంటాం.దాన్ని ఎప్పుడైనా మెట్రో ట్రైనులో చూశారా? ఇటువంటి దృశ్యమే తాజాగా ముంబై మెట్రో ట్రైనులో కనపడింది. ఓ యువకుడు తన సైకిల్ ను మెట్రో ట్రైనులో తీసుకెళ్లి, వీడియో తీసుకున్నాడు.  దీంతో ఇలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటిదే మరో వీడియో వెలుగు చూసింది.

 సాధారణంగా అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం తనతో పాటు సైకిల్ కూడా మెట్రోలో తీసుకెళ్లాడు. ముంబై మెట్రో ట్రైన్ లో యువకుడు తన సైకిల్ మెట్రో ట్రైన్ లో తీసుకెళ్లి ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హర్షిత్ అనురాగ్ అనే యువకుడు మెట్రో స్టేషన్ లో టికెట్ కొనుక్కొని.. తన సైకిల్ను పట్టుకొని ఎస్కలేటర్ ఎక్కాడు. ప్లాట్ ఫామ్ పై నిలబడి ట్రైన్ కోసం వేచి చూసి కాస్త ఖాళీగా ఉన్న ట్రైన్ ఎక్కాడు. ఇక సైకిల్ కోసం ప్రత్యేకంగా ట్రైన్ లో ఏర్పాటు చేసిన స్టాండ్ లో దాన్ని ఉంచి.. పక్క సీట్లో కూర్చున్నాడు. దిగాల్సిన ప్లేస్ రాగానే సైకిల్ తీసుకొని కిందకు దిగి మళ్ళీ ముంబై వీధిలో సైకిల్ తొక్కడం ప్రారంభించాడు.సందడిగా ఉండే ముంబై వీధుల్లో సైకిల్ తొక్కడం, ఇక్కడి మెట్రోలో ప్రయాణించడం ఓ గొప్ప అనుభవమని హర్షిత్ అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. నగరాన్ని హాయిగా చూడడానికి, మన ఫిట్‌నెస్‌ను కొనసాగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పాడు.  కాగా ట్రైన్ లో సైకిల్ తీసుకెళ్లడం ఏంటి గురు.. నీ తెలివికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్స్ ఈ వీడియో చూసి కామెంట్లు చేస్తున్నారు

Also Read :- కుప్పకూలిన బ్రిడ్జ్ .. ముగ్గురు నుజ్జునుజ్జు

 తమలో ఉన్న క్రియేటివిటీని బయటపెట్టి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంటూ ఏకంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు సైతం సంపాదించలేనంత మొత్తాన్ని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు   సంపాదిస్తున్నారు అని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో పాపులారిటీసంపాదించేందుకు ఎంతో మంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం అప్పుడప్పుడు తెర మీదకి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మెట్రో ట్రైన్ లో ఏదో ఒకటి వింతగా ట్రై చేసి ఇక సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించి లైకులు ఫాలోవర్లను సంపాదించాలని ఎంతోమంది అనుకుంటున్నారు.