ఈ చిన్నారి అద్భుతం : స్సైడర్ మ్యాన్ సిస్టర్.. అలా అలా గోడలు ఎక్కేస్తుంది.

ఈ చిన్నారి అద్భుతం : స్సైడర్ మ్యాన్ సిస్టర్.. అలా అలా గోడలు ఎక్కేస్తుంది.

స్పైడర్ మ్యాన్ పిల్లలకు.. పెద్దలకు బాగా తెలిసిన పేరు. సినిమాల్లో మనం స్పైడర్ మ్యాన్ విన్యాసాలు చూస్తుంటాం. గోడలు, పెద్ద పెద్ద బిల్డింగులు టపా టపా మని ఎక్కేస్తూ ఉంటాడు. పిల్లలు కూడా స్పైడర్ మ్యాన్ చేస్తున్న విన్యాసాలు చూసేందుకు చాలా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే.. తాజాగా ఓ స్పైడర్ గర్ల్స్  ఇలాగే అద్భుతాలు సృష్టించింది.  ఎలాంటి సపోర్ట్ లేకుండా  గోడను అవలీలగా ఎక్కేసింది.   

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ చిన్నారి ఎలాంటి ఆధారం లేకుండా గోడను ఎక్కేసింది .  ఈ  వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది, ఒక చిన్న అమ్మాయి త్వరగా గోడ ఎక్కి ఆపై క్రిందికి వస్తుంది. 

సూపర్ పవర్ ... మనుషుల్లో ఉండే ప్రతిభను ప్రపంచానికి చాటి చెపుతుంది. స్పైడర్ మ్యాన్ అభిమానులు .. అతను చేసే విధంగా చేసేందుకు ప్రయత్నిస్తారు.  ఈ వీడియోలో ఓ అమ్మాయి ఎలాంటి ఆధారం లేకుండా గోడ పైకి వెళ్లి.. మరల కిందకు దిగింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  వీడియోలో ఆ చిన్నారి  వేగంగా గోడ ఎక్కుతుంది.వైరల్ అవుతున్న వీడియోలో,  రెండు ఇరుకైన గోడల మధ్యన నిలబడి  ఉన్న అమ్మాయిని చూడవచ్చు.  ఈ అమ్మాయి  ఒక స్ట్రోక్‌లో పైకి వెళ్లుతుంది.  మరల  అక్కడి నుంచి  అంతే తేలిగ్గా అక్కడి నుంచి కిందకు వస్తుంది. ప్రస్తుతం  ఈ స్టంట్ గర్ల్ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో పాండియరాజన్ 1219 అనే ఖాతా నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. . ఈ వీడియో జూన్ 25న షేర్ చేయబడింది, ఈ వీడియోను  ఇప్పటివరకు 1 లక్ష 39 వేల మందికి పైగా లైక్ చేశారు.  వందలాది మంది అమ్మాయి ప్రతిభను ప్రశంసించారు.