
ఢిల్లీ మెట్రో ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. లవర్స్ కిస్ చేసుకోవడం, ప్యాసింజర్స్ గొడవ పెట్టుకోవడం, ఫ్రాంక్‌లు.. లాంటి వీడియోలతో ట్రెండింగ్ లో ఉంటుంది. తాజాగా మరోమారు ఢిల్లీ మెట్రో వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువతులు మెట్రోలో పోల్ పట్టుకుని డ్యాన్స్ చేశారు.
శశి కపూర్, పర్వీన్ బాబీ నటించిన 'సుహాగ్' చిత్రంలోని 'మెయిన్ తో బేఘర్ హూన్' పాటకు ఇద్దరు యువతులు మెట్రో పోల్‌తో డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షించారు. హాట్ మూమెంట్స్ తో అందరూ చూస్తుండగానే రచ్చ రచ్చ చేశారు. ఈ వీడియోను @HasnaZarooriHai అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ క్లిప్‌లో ఒక మహిళ కూర్చొని స్తంభానికి వేలాడుతున్నట్లు కనిపించగా.. మరొక యువతి ఆమె చుట్టూ తిరుగుతూ కనిపించింది.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో చెకింగ్ చాలా అవసరం, రీల్స్ చేసే వారికి ఇది కొత్త లొకేషన్ లాగా మారిపోయిందంటూ కొందరు కామెంట్ చేశారు. DMRC ఇటువంటి వ్యక్తులపై మీరు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? వీరు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మెట్రో సేవలను కించపరిచారు అని మరికొందరు ఆరోపిస్తున్నారు.
DMRC.. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఢిల్లీ మెట్రో రైళ్లలో వీడియోలను చిత్రీకరించవద్దని, ఇబ్బంది కలిగించవద్దని ప్రయాణికులను కోరింది. అయినప్పటికీ ఈ తరహా వీడియోలు, రీల్స్. డ్యాన్స్ లు మాత్రం నెటిజన్లు ఆపకపోవడం సామాన్య ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది.