షాకింగ్ వీడియో.. ఇది ఏలియనా? దెయ్యమా?

షాకింగ్ వీడియో.. ఇది ఏలియనా? దెయ్యమా?

హజారీబాగ్: ఏలియన్‌లు ఉన్నాయా లేదా అనే విషయంపై ఆసక్తికర చర్చలు సాగుతూ ఉంటాయి. ఈ అంశం అంత ఇంట్రెస్టింగ్ కాబట్టే హాలీవుడ్‌లో ఏలియన్‌లపై ఎన్నో సినిమాలు వచ్చాయి. హిందీలో కూడా కోయి మిల్ గయా లాంటి ఫిల్మ్ ఏలియన్ నేపథ్యంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే మూవీల్లో కాకుండా నిజంగానే ఏలియన్‌ భూమ్మీదకు వస్తే? అదీ మన దేశంలో కనిపిస్తే? ఏంటి ఏలియన్‌లు భూమ్మీదకు రావడమేంటని అనుకుంటున్నారా?.. జార్ఖండ్‌ రాష్ట్రంలోని హజారీబాగ్‌లో రాత్రిపూట ఓ ఏలియన్ లాంటి రూపం రోడ్డుపై తిరుగాడుతున్న వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. దీంట్లో నిజమెంతో తెలియదు. కానీ వీడియోలో ఉన్నది నిజంగా ఏలియనేనా కాదా అని ఇంకా స్పష్టత రాలేదు. ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో ఏలియన్ లాంటి రూపం నడుస్తుండటాన్ని చూడొచ్చు. అటు వైపుగా వెళ్తున్న బైకుల మీద ఉన్న వ్యక్తులు ఆ రూపాన్ని వీడియో తీశారు. బైక్ నడుపుతున్న వ్యక్తుల్లో ఒకరు ఆ రూపాన్ని దెయ్యమంటూ హిందీలో కామెంట్ చేయడాన్ని చూడొచ్చు. ఇది దెయ్యమా, మంత్రగత్తెనా లేదా ఏలియనా అనే దానిపై నెటిజన్స్ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.