బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగిన ఈ వేడుకలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ సైనికుడి గుర్రం అదుపు తప్పింది. రాయల్ హౌస్ హోల్డ్ లోని మౌంటెడ్ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టేంత పని చేసిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఈ ఘటన చార్లెస్ 3 వెస్ట్ మినిస్టర్ అబే నుంచి బకింగ్ హామ్ ప్యాలెస్ కి తిరిగి వెళ్లిపోయిన తర్వాత చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గుర్రం ఓ మెటల్ బారీ కేడ్ ను ఢీకొట్టి ప్రజలపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తోన్న గోల్డ్ స్టేట్ కోచ్ కు కేవలం గజం దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనతో వెంటనే అప్రమైతమైన సైనిక సిబ్బంది.. ఆ గుర్రాన్ని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం అందరికీ ఉపశమనాన్ని కలిగించింది.
https://twitter.com/Spriter99880/status/1654871664465772548
