రైల్లో యువతి బెల్లీ డ్యాన్స్.. మండిపడుతున్న నెటిజన్లు

 రైల్లో యువతి బెల్లీ డ్యాన్స్.. మండిపడుతున్న నెటిజన్లు

రైళ్లు ప్రజారవాణా చేయడమే కాదు..వినోదాత్మక కేంద్రాలుగా మారిపోయాయి. వింత వేషధారణలు, డ్యాన్సులతో రీల్స్ చేయడం..ఇలా ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన కంటెంట్కు కొదవలేదు. వినోదాత్మక కంటెంట్ కు ఢిల్లీ మెట్రో ఫేమస్ అయింది. ఇప్పటివరకు ఢిల్లీ మెట్రో రైల్ కంపార్టుమెంట్లలో రీల్స్ మాత్రమే చూశారు.. ఇప్పుడు వేగంగా వందల కిలోమీటర్లు పరుగెత్తే ఎక్స్ ప్రెస్ రైళ్లలో కూడా ఈ రీల్స్ పిచ్చి మొదలైంది. వేగంగా కదులుతున్న ఎక్స్ ప్రెస్ రైలు కంపార్టుమెంట్ లో ఓయువతి బెల్లీ డ్యాన్స్ చేస్తూ.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..ఆవీడియో వైరల్ అవుతోంది..వీడియో చూసిన  నెటిజన్లు కొందరు ముచ్చట పడు తుంటే.. మరికొందరు యువతి తీరుపై మండిపడుతున్నారు. 

ఈ వీడియలో నల్లటి క్రాప్ టాప్, ప్యాంటు ధరించిన ఆ యువతి నడుమును వయ్యారంగా తిప్పుతూ విన్యాసాలు చేస్తోంది. ప్రముఖ లిరిక్ రైటర్ రాఫ్తార్  ‘బేబీ మార్వాకే మానేగీ ’ బీట్ లకు డ్యాన్స్ చేస్తూ సీట్లపైకి ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఎక్కడో, ఏ రైలో తెలియదు కానీ కదులుతున్న రైల్లో ఆ యువతి రీల్స్ చేసినట్లో తెలుస్తోంది.  ఈ వీడియో నెట్టింట సంచలనం రేపుతోంది. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.. రైళ్లలో ప్రయాణంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసభ్యకరమైన, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి ప్రదర్శనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతి బెల్లీ డ్యాన్స్ పై కామెంట్లు వరద ప్రవాహం వస్తున్నాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ అయ్యో నేను ఆ సమయంలో రైలు ఉంటే ఎంత బాగుండేది.. మిస్సయ్యాను అన్నట్లు అసహనం వ్యక్తం చేశాడు. 

రైళ్లలో ఇలాంటివి కొత్తేమి కాదు.. ఢిల్లీ మెట్రో లో రోజుకొకటి జరుగుతుంటాయి.. ఇందులో సాధారణ యవతతో పాటు సెలబ్రీటీలు కూడా రీల్స్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమనేది.. టిక్ టాక్ తో మొదలైంది.. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేశాక .. ఇన్ స్టా గ్రామ్, ఎక్స్, థ్రెడ్స్ ఇలా  సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో పోస్ట్ చేయడం సాధారణమై పోయింది.. యువతలో గుర్తుంపు పొందాలని ఎక్కువ క్రేజ్ ఉంటుంది.. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయి సెలబ్రీటీ స్థాయికి వెళ్లిన వారు చాలామంది.. అలాంటి పాపులారిటీ కోసం సమయం, ప్లేస్ అనేది చూడకుండా ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు. 

ఇలా రైళ్లలో రీల్స్ చేయడం తోలి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా.. రైల్వే అధికారులకు తలనొప్పిగా మారాయి.. ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రోలో రీల్స్ పై పెద్ద దుమారమే రేగింది. మెట్రలో రీల్స్ చేయొద్దంటూ ఢిల్లీ మెట్రో రైల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా రీల్స్ వరద ఆగలేదనుకోండి.. ఏదీ ఏమైనా  పాపులర్ కావాలంటే.. ఒకరికి ఇబ్బంది కలిగించకుండా తమ టాలెంట్ ను ప్రదర్శించొచ్చు కదా అని..  నెటిజన్లు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు.