కోహ్లీని రెచ్చగొడితే డేంజర్

కోహ్లీని  రెచ్చగొడితే డేంజర్

మెల్‌‌బోర్న్‌‌: ఇండియాతో టెస్టు సిరీస్‌‌కు ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆ జట్టు లిమిటెడ్‌‌ ఓవర్ల కెప్టెన్‌‌ ఆరోన్‌‌ ఫించ్‌‌ కీలక సూచన చేశాడు. టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీని అతిగా కవ్విస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అపొనెంట్‌‌ ప్లేయర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడే విరాట్‌‌ను స్లెడ్జింగ్‌‌ చేసే విషయంలో కాస్త బ్యాలెన్స్‌‌ ఉండేలా చూసుకోవాలన్నాడు.  ఈ విషయంలో ఏదైనా తేడా జరిగితే అతను ప్రత్యర్థి ప్లేయర్లపై ఏ మాత్రం జాలి చూపకుండా చెలరేగి పోతాడని చెప్పాడు. అయితే, తన పని విషయంలో కోహ్లీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడని ఫించ్‌‌ అన్నాడు. ‘కోహ్లీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఫీల్డ్‌‌లో అతనిప్పుడు చాలా రిలాక్స్‌‌డ్‌‌గా ఉంటూ గేమ్‌‌ టెంపోను అర్థం చేసుకుంటున్నాడు.  అపోజిట్‌‌ టీమ్‌‌ను దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్టు చాలా ప్లానింగ్‌‌ చేస్తాడు. అలాగే, తాను కూడా బాగా ప్రిపేర్‌‌ అవుతాడు. అలాగే, తన టీమ్‌‌పై అతనికి నమ్మకం ఎక్కువ’ అని ఫించ్​ చెప్పుకొచ్చాడు.