IPL 2026 ఫైనల్కి ముందు చిక్కుల్లో కోహ్లీ.. ఇకపై ఈ గ్లాసెస్ పెట్టుకుంటే కఠిన చర్యలు !

IPL 2026 ఫైనల్కి ముందు చిక్కుల్లో కోహ్లీ.. ఇకపై ఈ గ్లాసెస్ పెట్టుకుంటే కఠిన చర్యలు !

Virat Kohli: ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడే రెండో జట్టు ఏదో తేలిపోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్‌గా ఇలాంటి టైమ్‌లోనే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఒక సెన్సేషనల్ రూల్‌ను తీసుకొచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే పరిమిత ప్రాంతాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ గ్లాసెస్ (Smart Sunglasses) వాడకంపై బీసీసీఐ కంప్లీట్ బ్యాన్ విధించింది.

హాట్ టాఫిక్ గా బీసీసీఐ నిర్ణీయం: 
బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో "హాట్ టాపిక్‌"గా మారింది. ఈ కొత్త రూల్ వల్ల ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్ వంటి టాప్ ప్లేయర్స్ కోట్ల రూపాయల బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోల్పోయే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

కోహ్లీ యాడ్ చేయడం వల్లే ఈ నిర్ణయమా?: 
ప్రస్తుతం ఐపీఎల్ లైవ్ బ్రాడ్‌కాస్టింగ్‌లో విరాట్ కోహ్లీ యాక్ట్ చేసిన 'Oakley Meta AI' స్మార్ట్ గ్లాసెస్ యాడ్స్ విపరీతంగా ప్లే అవుతున్నాయి. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో కోహ్లీ ఆ గ్లాసెస్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ, మెటా ఏఐ (Meta AI)ని క్వశ్చన్స్ అడుగుతూ కనిపిస్తాడు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్, మెసేజింగ్, వీడియో రికార్డింగ్ ఈజీగా చేయొచ్చు.  

ఈ గ్యాడ్జెట్స్తో మ్యాచ్ ఫిక్సింగ్: 
ఇలాంటి హైటెక్ గ్యాడ్జెట్స్ వల్ల మ్యాచ్ ఫిక్సింగ్, లైవ్ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని భావించిన బీసీసీఐ ఏసీఎస్‌యూ.. ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అఫీషియల్స్ ఎవరూ కూడా వీటిని గ్రౌండ్‌లోకి లేదా డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకురాకూడదని ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ బ్యాన్ ఎఫెక్ట్ వల్ల 'Oakley' బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ సదరు కంపెనీతో ఉన్న కోట్ల రూపాయల స్పాన్సర్‌షిప్ డీల్‌ను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 

రిషభ్ పంత్‌కూ తప్పని తిప్పలు!
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియా గెలిచినప్పుడు రిషభ్ పంత్ ఈ గ్లాసెస్ పెట్టుకుని సెలబ్రేషన్స్ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా అవి తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఈ స్మార్ట్ గ్లాసెస్ వేసుకుని వీడియోలు షూట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఐపీఎల్ 2026 లో పెట్టిన ఈ రూల్, త్వరలోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే పంత్ లాంటి ఆటగాళ్లు తమ పర్సనల్ షూటింగ్స్ కోసం వీటిని వాడటం కుదరదు.

బీసీసీఐ రూల్ వెనుక అసలు రీజన్ ఇదే: 
క్రికెట్‌లో అవినీతిని, బెట్టింగ్ నెట్‌వర్క్స్‌ను అరికట్టడానికి బీసీసీఐ ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లోకి మొబైల్ ఫోన్లు ఎలాగైతే అలౌ చేయరో, అలాగే కెమెరా, మైక్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా నిషేధించడం భద్రతా పరంగా అవసరమని బోర్డు భావించింది. ప్లేయర్స్ బ్రాండ్స్ ద్వారా కోట్లు సంపాదించుకున్నా.. ఆట యొక్క పారదర్శకత విషయానికొస్తే బీసీసీఐ "నో కాంప్రమైజ్" అని ఈ నిర్ణయంతో మరోసారి ప్రూవ్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)