చంఢీఘర్: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో మరో చారిత్రాత్మక రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే సీజన్‌లో 700 ప్లస్ రన్స్ పూర్తి చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. శుక్రవారం (మే 29) ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచులో ఈ మైలురాయిను అందుకున్నాడు.
దీంతో పాటు మరో రికార్డ్ కూడా సృష్టించాడు వైభవ్. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. 2016 ఎడిషన్‌లో పవర్‌ప్లేలో 467 పరుగులు చేశాడు వార్నర్. 2026లో పరుగుల వరద పారిస్తోన్న15 ఏళ్ల బుడ్డోడు వార్నర్ రికార్డును తుడిచిపెట్టాడు.
పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు:
- 1 వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ 2026 700+ పరుగులు
- 2 యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ 2023 625 పరుగులు
- 3 షాన్ మార్ష్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2008 616 పరుగులు
- 4 రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ 2024 573 పరుగులు
- 5 ప్రభ్‌సిమ్రాన్ సింగ్ పంజాబ్ కింగ్స్ 2025 549 పరుగులు
