హైదరాబాద్ మూవీ లవర్స్ కి పండగ లాంటి వార్త: ఐమ్యాక్స్ స్క్రీన్ తో సుదర్శన్ 70MM థియేటర్ రీలాంచ్...!

హైదరాబాద్ మూవీ లవర్స్ కి పండగ లాంటి వార్త: ఐమ్యాక్స్ స్క్రీన్ తో సుదర్శన్ 70MM థియేటర్ రీలాంచ్...!

హైదరాబాద్ మూవీ లవర్స్ కి పండగ లాంటి వార్త ఇది... మన ఫేవరెట్ సుదర్శన్ 70MM థియేటర్ తిరిగి ప్రారంభం కానుంది... అది కూడా ఐమ్యాక్స్ స్క్రీన్ తో. మూవీ లవర్స్ కి ఇంతకంటే గుడ్ న్యూస్ ఉంటుందా. ఓల్డ్ సుదర్శన్ థియేటర్ ను ఐమ్యాక్స్ గా మార్చేందుకు ఏషియన్ సునీల్ నారంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఈ ప్రాజెక్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి కూడా పార్ట్నర్స్ గా ఉంటారని... మరో నాలుగు, ఐదు రోజుల్లో అధికారిక ప్రకటన ఉంటుందని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుదర్శన్ 70MM ఉన్న ప్రదేశంలో AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో 7 స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడు స్క్రీన్లలో ఒకటి ఐమ్యాక్స్ స్క్రీన్ తో ఉండనున్నట్లు తెలుస్తోంది.
 

సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఈ వార్త గనక నిజమే అయితే... హైదరాబాద్ మూవీ లవర్స్ కి బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మరో థియేటర్ వచ్చినట్లే అని చెప్పాలి. అయితే... ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే... హైదరాబాద్ లో ఐమ్యాక్స్ ఎక్స్ పీరియన్స్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొత్త మల్టీప్లెక్స్ లు..

ఓడియన్ మల్టీప్లెక్స్:

ఓడియన్ మల్టీప్లెక్స్.. 2026 జనవరి 9న ప్రారంభం అయ్యింది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ గా ప్రసిద్ధి చెందిన దీనిని ఇప్పుడు 8-స్క్రీన్ల మల్టీప్లెక్స్ గా అప్ గ్రేడ్ చేశారు. ప్రొజెక్షన్, లగ్జరీ సీటింగ్,మల్టీలెవల్ పార్కింగ్ తో పునర్నిర్మించారు. లోపల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. సినిమాలు, షాపింగ్ రెండింటినీ ఒకే దగ్గర చేసుకోవచ్చు.

AMB క్లాసిక్ త్వరలో ..

AMB క్లాసిక్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండవ మల్టీప్లెక్స్ వెంచర్ గా AMB క్లాసిక్ ఇప్పటికే PVR, INOX వంటి పెద్ద పేర్లతో ఎలా పోటీ పడుతుందనే దానిపై సినీ ప్రేక్షకులలో ఉత్సుకత నెలకొంది.

ఓడియన్,AMB క్లాసిక్ తో RTC X రోడ్స్ 18 నుంచి 20 థియేటర్లకు పెరుగుతుంది. ఇది నాస్టాల్జియాతో నిండిన సింగిల్ స్క్రీన్ల నుంచి ఆధునిక మల్టీప్లెక్స్ సంస్కృతికి మారింది. లగ్జరీ ఎక్స్ పీరియెన్స్ పై మూవీ లవర్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.