మామిడి పండు నాచురల్ గా పండిందా లేదా? తెలుసుకోవాలంటే సింపుల్ చిట్కా

మామిడి పండు నాచురల్ గా పండిందా లేదా? తెలుసుకోవాలంటే సింపుల్ చిట్కా

సమ్మర్ లో వచ్చే సీజనల్ పండు, విరివిగా దొరికేపండు మామిడి పండు.. సహజమైన తీయదనంతో ఎంతో రుచిగా ఉంటుంది.  రకరకాల మామిడి పండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. బంగినపల్లి, తోతాపురి, రసాలు ఇలా అనేక రకాల పండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి.  చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఈ పండును చాలా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటాం. అయితే మీరు తింటున్న మామిడి పండు సేఫేనా? అవి నాచురల్ గా పండాయా లేదా అనేది చాలామందిలో ఉన్న డౌట్.. ఎందుకంటే సీజన్ సీజన్ కు మామిడి పండు టేస్ట్  మారిపోతుంది.. తిన్నవారు అనారోగ్యం పాలు అవుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో మామిడి పండు సహజంగా(నాచురల్ గా) పండిందా లేదా  తెలుసుకోవడం ఎలా..  సింపుల్ చిట్కా గురించి తెలుసుకుందాం..    

మామిడి పండు మనం ఎంత ఇష్టంగా తింటున్నామో.. అంతే కష్టంగా రోగాల బారిన పడుతున్నాం.. ఇది  ఎవరో చెప్పిన మాట కాదు.. స్వయంగా డాక్టర్లు చెబుతున్న విషయం. మనలో చాలామందికి కూడా ఇలాంటి అనుభవం ఎదురయి ఉంటుంది. ఎందుకు అంటే  ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్న మామిడి పండ్లను త్వరగా పండేందుకు  కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో మగ్గబెడుతున్నారు. ఇందుకు ఉదాహరణ చాలాసార్లు ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు పట్టుబడ్డ ఘటనలు ఉన్నాయి. సహజంగా పండేంత టైం ఇవ్వకుండా రాత్రికిరాత్రే కెమికల్స్ వేసి  పండిస్తున్నారు. దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటోందంటున్నారు డాక్టర్లు.

మరీ మామిడి పండు నాచురల్ పండిందా లేక ఆర్టిఫిషియల్ గా పండించారా.. కనుక్కోవడం ఎలా?  ఓ చిన్న టెస్ట్ ద్వారా మనం మామిడి పండు నాచురల్ పండిందా లేదా అని నిర్దారించవచ్చు. సింపుల్ టెస్ట్.. ఒక నిమ్మకాయ(లెమన్) ముక్కను తీసుకొని మ్యాంగో టిప్ దగ్గర రుద్దితే అసలు నిజం బయటపడుతుంది.. 10 సెకన్లు అలా నిమ్మ ముక్క మ్యాంగో టిప్ దగ్గర రుద్దగానే సహజంగా పండితే అక్కడ ఎలాంటి రంగు మారదు.. అదే ఆర్టిఫిషియల్ గా పండిస్తే మ్యాంగో టిప్ దగ్గర , నిమ్మకాయ ముక్క నీలి రంగు  లేదా పర్పుల్ కలర్ లోకి మారుతుంది. దీని ద్వారా మామిడి పండును కెమికల్ వేసి పండించారని గుర్తించవచ్చు.