ఇండియన్ టీమ్ కు కోహ్లీయే బాస్: రవిశాస్త్రి ప్రశంసల వర్షం

ఇండియన్ టీమ్ కు కోహ్లీయే బాస్: రవిశాస్త్రి ప్రశంసల వర్షం

ఇండియా క్రికెట్కు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాస్ లాంటి వాడని కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.  టీమ్కు కెప్టెన్ బాస్ అని తాను నమ్ముతానని.. ప్లేయర్లు సానుకూల దృక్పథంతో భయం లేకుండా ఆడేలా చూసుకోవడమే కోచింగ్ స్టాఫ్ పని అని చెప్పాడు. ‘జట్టును కెప్టెన్ ముందుండి నడిపిస్తాడు. సారథిపై భారాన్ని తగ్గించేందుకు మేం ప్రయత్నిస్తాం. కానీ, కెప్టెన్గా తన బాధ్యతలను అతడు నిర్వర్తించాల్సిందే. మ్యాచ్ను కంట్రోల్ చేయడంలో కెప్టెన్ పాత్రే కీలకం. ఫిట్నెస్ విషయానికొస్తే.. విరాట్ అందరికీ ఆదర్శం. ఒకరోజు ఉదయం కోహ్లీ నాతో  మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన ప్లేయర్గా మారాలనుకుంటున్నానని.. అన్ని కండీషన్స్ లోనూ సత్తా చాటాలనుకుంటున్నానని చెప్పాడు. అందుకు తగ్గట్టే తన బాడీపై ప్రత్యేక దృష్టి పెట్టి అద్భుతంగా మలుచుకున్నాడు. ట్రెయినింగ్తోపాటు డైట్ విషయంలోనూ అతడు ఎన్నో త్యాగాలు చేశాడు. మళ్లీ ఓ రోజు తాను వెజిటేరియన్గా మారుతున్నట్లు చెప్పాడు. అతడు అలా ప్రమాణాలు నెలకొల్పినప్పుడు ఆ ప్రభావం ఇతరులపై తప్పక పడుతుంది’ అని శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇక తమకు టెస్ట్ క్రికెట్టే అత్యుత్తమ ఫార్మాట్‌ అని చెప్పాడు. తమకదే బెంచ్మార్క్అన్నాడు. లాంగ్‌ ఫార్మాట్లో తాము సరికొత్త  ప్రమాణాలు నెలకొల్పాలని భావిస్తున్నామని వివరించాడు.