T20 World Cup 2024: ఆలస్యంగా అమెరికాకు కోహ్లీ.. బంగ్లా పోరుకు దూరం

T20 World Cup 2024: ఆలస్యంగా అమెరికాకు కోహ్లీ.. బంగ్లా పోరుకు దూరం

టీ20 ప్రపంచ కప్ 2024 లో తలపడే భారత క్రికెట్ బృదం అమెరికా శనివారం (మే 25) బయలుదేరిన సంగతి తెలిసిందే. ప్రయాణ బృందంలో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు ప్రధాన క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ బ్యాచ్ లో కోహ్లీ మాత్రం కనిపించలేదు. 

విరాట్ కోహ్లీ ఆలస్యంగా అమెరికాలో అడుగుపెడతాడని నివేదికలు చెబుతున్నాయి. అమెరికాకు తాను వెళ్లడం ఆలస్యం అవుతుందని .. ఇందుకు గాను BCCI నుండి అనుమతి పొందినట్లు సమాచారం. దీని ప్రకారం కోహ్లి మే 30వ తేదీ ఉదయం న్యూయార్క్‌కు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్‌ ఆడే ఏకైక వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లీ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

"కోహ్లీ జట్టులో ఆలస్యంగా చేరతాడని ముందుగానే మాకు తెలియజేసాడు. అందుకే BCCI అతని వీసా అపాయింట్‌మెంట్‌ను తరువాత తేదీకి ఉంచింది. అతను మే 30 తెల్లవారుజామున న్యూయార్క్‌కు వెళ్లాలని భావిస్తున్నాడు. BCCI అతని రిక్వెస్ట్ ను అంగీకరించారు.”అని BCCI అధికారి ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నట్లుగా సమాచారం. 

కోహ్లీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అమెరికా ప్రయాణం ఆలస్యం కానుంది. దుబాయ్‌లోని కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా బీసీసీఐ నుండి పర్మిషన్ తీసుకున్నాడు. మరోవైపు హార్దిక పాండ్య సైతం లేట్ గా భారత జట్టులో చేరనున్నారు. 

టీ20 ప్రపంచ కప్ పోరుకు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీ జూన్ 2న ప్రారంభమై జూన్ 29న ముగియనుంది. ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. జూన్ 9న దాయాది దేశం పాకిస్థాన్‌‌తో తలపడనుంది. ప్రాక్టీస్‌లో భాగంగా మే 31న భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక వార్మప్ మ్యాచ్ జరగనుంది.

టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

స్టాండ్ బై ప్లేయర్స్: శుభ్ మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.