37 వయసులోనూ జట్టు కోసం ప్రాణం పెడుతున్నడు.. ఇది కోహ్లీ అంటే..!  

37 వయసులోనూ జట్టు కోసం ప్రాణం పెడుతున్నడు.. ఇది కోహ్లీ అంటే..!  

37 ఏళ్ళ వయసులోనూ ఒక ప్లేయర్‎పై జట్టు మొత్తం ఆధారపడుతుందంటే అతని సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళ క్రితం ఎలాంటి టాప్ ఫామ్‎లో ఉన్నాడో ఇప్పుడు కూడా అదే ఫామ్‎తో నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికీ జట్టు కోసం ఏదైనా చేయాలి.. మ్యాచ్‎లను గెలిపించాలి.. పరుగుల వరద పారించాలనే తపన ఇంకా అలాగే ఉంది. కుర్రాడిలా ఉండాల్సిన దూకుడుతో పాటు ఎంతో పరిణితి ఉన్న అరుదైన క్రికెటర్. 37 ఏళ్ళ వయసులోనూ తన అత్యుత్తమ ఫిట్ నెస్‎తో దూసుకెళ్తున్న అతడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్ మెషీన్.. కింగ్.. విరాట్ కోహ్లీ.

కోహ్లీ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా ప్రతిసారి తన ఆటతో కొత్తగా కనిపిస్తాడు. సెంచరీ చేయడం పెద్ద విశేషం కాకపోయినా జట్టు గెలుపుపై విరాట్‎కు ఉన్నంత నిబద్ధత మరెవరికీ ఉండదేమో. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం (మే 13) కోల్ కతా నైట్ రైడర్స్‎తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ రెచ్చిపోయి ఆడాడు. 60 బంతుల్లో 105 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తన సెంచరీతో RCB జట్టును ప్లే ఆఫ్స్‎కు చేర్చాడు. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న RCBకి రన్ రేట్ అన్ని జట్ల కంటే ఎక్కువగా ఉండడంతో 99 శాతం సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్‎లో ఒకవేళ కోహ్లీ త్వరగా ఔట్ అయితే బెంగళూరు జట్టు విజయం సాధించేది కాదు. 

►ALSO READ | IPL 2026: ధర్మశాలలో పంజాబ్ భారీ స్కోర్.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

ప్రస్తుత జట్టును చూసుకుంటే బ్యాటింగ్‎లో ఒక్క కోహ్లీపైనే RCB ఆధారపడుతుంది. కోహ్లీ మినహాయిస్తే ఎవరూ ఫామ్ లో లేరు. పడికల్ పర్వాలేదనిపిస్తున్నా.. కెప్టెన్ పటిదార్ తన రిధం కోల్పోయాడు. టిమ్ డేవిడ్ నుంచి ఒక మంచి నాక్ రాక చాలా రోజులైంది. జితేష్ గురించి ఎంత తక్కువగా మాటాడుకుంటే అంత మంచింది. ఓపెనర్ జాకబ్ బెతేల్ ఇంకా గాడిలో పడలేదు. దీంతో భారమంతా కోహి ఒక్కడిపైనే పడుతుంది. చివరి రెండు మ్యాచ్ ల్లో కోహ్లీ డకౌటైతే.. జట్టును ఆదుకునేవాడు కరువయ్యారు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోతే.. ఆ తర్వాత ముంబై తో జరిగిన మ్యాచ్ లో గెలుపు కోసం చివరి బంతివరకు శ్రమించాల్సి వచ్చింది. బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఇంకా కోహ్లీపైనే డిపెండ్ అవుతుందంటే.. సింగిల్ హ్యాండ్ తో జట్టును మోస్తున్నాడు. 

చిన్న గాయమైతేనే మ్యాచ్ ఆడకుండా దూరమయ్యేవారు ఉన్నారు. ఫిట్ నెస్ లేక ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగేవారున్నారు. ఫీల్డింగ్ చేయలేక కేవలం బ్యాటింగ్ మాత్రమే ఆడేవారు కూడా ఉన్నారు. కానీ కోహ్లీ మాత్రం ఈ సీజన్ లో గాయమైనా జట్టు కోసం ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. తన గాయం గురించి.. ఆరోగ్యం గురించి కంటే జట్టును గెలిపించాలనే సంకల్పం విరాట్ కు ఎక్కువగా ఉంటుంది. సుదీర్ఘ కెరీర్ లో కోహ్లీ గాయపడి మ్యాచ్ లకు దూరమైన సందర్భాలు అంటే వేళ్ళ మీద లెక్కపెట్టుకోవాల్సిందే. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో గాయం కారణంగా కోహ్లీ దూరమైన మ్యాచ్ లు మహా అయితే ఒకటి లేదా రెండు ఉంటాయి. ఫిట్ నెస్ అంటే కింగ్ కేరాఫ్. 37 ఏళ్ళ వయసులోనూ ఫిట్ నెస్ కాపాడుకోవడమే కాదు టాప్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు.