టీమిండియా స్టార్ ఆటగాడు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాడు. తన బ్యాటింగ్ తో.. ఆటిట్యూడ్ తో అందరి దృష్టిని విరాట్ తన వైపుకు తిప్పుకుంటాడు. తాజాగా విరాట్ కోహ్లీ ఒక విషయంలో బాగా వైరల్ అవుతున్నాడు. అదేంటో కాదు విరాట్ కోహ్లీ పోలికలతో మరో వ్యక్తి ఉండడం విశేషం. ఒక చిన్న పిల్లవాడు చిన్నపాటి విరాట్ కోహ్లీని అచ్చు గుద్దినట్టు దించేశాడు. వినడానికి ఆశ్చర్యరంగా ఉన్నా ఇది నిజం. కోహ్లీ పోలికలతో ఉన్న ఒక చిన్న పిల్లవాడు కోహ్లీని కూడా కలవడం విశేషం. ప్రస్తుతం కోహ్లీ పోలికలతో ఉన్న చిన్న పిల్లవాడు కోహ్లీని కలవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వడోదరలో జరిగిన తొలి వన్డేలో ఇండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి నిలిచింది. ఈ మ్యాచ్ కు ముందు ఒక అరుదైన సీన్ చోటు చేసుకుంది. తొలి వన్డేకు ముందు ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు విరాట్ ను చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు కోహ్లీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అయితే ఇక్కడే ఊహించని సీన్ చోటు చేసుకుంది.
ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్నప్పటి కోహ్లీలాగే ఉండడం విశేషం. అక్కడ ఉన్న ఒక పిల్లాడు కోహ్లీ చిన్నప్పటి రూపాన్ని అచ్చు గుద్దినట్టు దించేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కోహ్లీ కూడా ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. చిరునవ్వు నవ్వడంతో ఈ వీడియో ముచ్చట గొలిపేలా ఉంది. కోహ్లీ తన మనసులో ‘వీడేంటి నా లాగే ఉన్నాడు..’ అని అనుకుని ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
ప్రస్తుతం కోహ్లీ విషానికి వస్తే న్యూజిలాండ్ తో జరగబోయే రెండో వన్డేకు సిద్ధమవుతున్నాడు. తొలి వన్డేలో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్..తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లీ అద్భుత బ్యాటింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తొలి వన్డేలో మిస్ అయిన సెంచరీ రెండో వన్డేలో కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లీ చివరి ఐడి మ్యాచ్ లు గమనిస్తే రెండు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లీ అంచనాలకు తగ్గట్టుగా ఆడితే సెంచరీ చేయడం సాధ్యం కాకపోవచ్చు.
Virat Kohli said to Rohit Sharma, "Wha dekh Mera duplicate betha hai (Look, my duplicate is sitting there)".
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 12, 2026
- Virat Kohli called him a Chota Cheeku 😭❤️ pic.twitter.com/b4r1DopMUa
