‘ఒత్తిడిలోనూ చితక్కొట్టడమే విరాట్ స్పెషాలిటీ’

‘ఒత్తిడిలోనూ చితక్కొట్టడమే విరాట్ స్పెషాలిటీ’

ఇంగ్లండ్‌‌-టీమిండియా టెస్టు సిరీస్‌‌లో విరాట్ కోహ్లిపై అదనపు ఒత్తిడి ఉంటుందని ఇంగ్లిష్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌‌ను రహానె కెప్టెన్సీలో భారత్ 2-1తో చేజిక్కించుకున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌ కోహ్లి సారథ్యానికి సవాల్‌‌గా నిలుస్తుందన్నాడు. ఆసీస్‌‌లో భారత్ సాధించిన గెలుపు అపురూపమని, ఆ సిరీస్‌‌లో రహానె కెప్టెన్సీ సూపర్బ్ అని కొనియాడాడు.

‘ఆసీస్‌‌తో సిరీస్‌‌ను రహానె కెప్టెన్సీలో గెల్చుకున్న భారత జట్టు పగ్గాలను తిరిగి కోహ్లి చేపట్టనున్నాడు. ఇది ఓ రకంగా కోహ్లి మీద అదనపు ఒత్తిడిని పెంచుతుంది. కానీ ఓ విషయం గుర్తుంచుకోవాలి.. కోహ్లి తన మొత్తం జీవితం ఒత్తిడితో సావాసం చేశాడు. ఎంత ఒత్తిడిని పెంచితే అంత అద్భుతంగా రాణించడం కోహ్లీకే చెల్లింది. కాబట్టి ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌లో విరాట్ భీకరంగా చెలరేగుతాడని అనుకుంటున్నా’ అని నాసిర్ హుస్సేన్ చెప్పాడు.