వరల్డ్‌ బెస్ట్‌‌ బ్యాట్స్‌ మన్‌‌గా కోహ్లీ

వరల్డ్‌ బెస్ట్‌‌ బ్యాట్స్‌ మన్‌‌గా కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ డెకేడ్‌ లో గ్రేట్‌ క్రికెటర్ల జాబితా ‘విజ్డెన్‌‌ అల్మానిక్‌‌’లో విరాట్‌ చోటు సంపాదిం చాడు. స్టెయిన్‌‌, డివిలియర్స్‌ , స్మిత్‌ ,విమెన్స్‌ ఆల్‌‌రౌండర్‌ ఎల్లీస్‌ పెర్రీకి కూడా ఇందులో స్థానం లభించింది. ఈ పదేళ్లలో ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌ ల్లో 5, 775 రన్స్‌ చేసిన కోహ్లీ వరల్డ్‌ బెస్ట్‌‌ బ్యాట్స్‌ మన్‌‌గా నిలిచాడు. ఈ డెకేడ్‌ విజ్డెన్‌‌ టెస్ట్‌‌, వన్డే టీమ్‌ ల్లోనూ విరాట్‌ కు చోటు లభించిన సంగతి తెలిసిం దే. ‘కోహ్లీ గొప్ప మేధావి. ఎప్పటికప్పుడు సవాళ్లను స్వీకరించడం అతనికి అలవాటు. సమయానుకూలంగా తనను తాను మార్చుకుంటూ బెస్ట్‌‌ బ్యాట్స్‌ మన్‌‌గా ఎదుగుతున్నాడు. 2014లో ఇంగ్లండ్‌ టూర్‌ ముగింపు నుంచి నవంబర్​లో కోల్‌‌కతాలో బంగ్లాదేశ్‌ తో జరిగిన రెండో టెస్టు వరకుకోహ్లీ 63 యావరేజ్‌ తో 21 సెం చరీలు, 13 హాఫ్‌ సెంచరీలు చేశాడు. మూడు ఫార్మాట్లలో 50 యావరేజ్‌ కలిగిన ఆటగాడు. సచిన్‌‌ రిటైర్‌ కావడం, ధోనీ ఆటకు దూరంగా ఉండడంతో ఇతర క్రికెటర్లపై లేని ఒత్తిడిని భరిస్తూ ప్రతిభ చాటుతున్నాడు’ అని విజ్డెన్‌‌ రాసుకొచ్చింది.