దుబాయ్ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టాప్–2 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల లిస్ట్‌లో ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఐసీసీ మంగళవారం విడుదల చే సిన ర్యాంక్సింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ విభాగంలో టాప్‌లో ఉన్న విరాట్ ఖాతాలో 871 రేటింగ్ పాయింట్లున్నాయి.
రోహిత్ 855 పాయింట్లతో అతని తర్వాత ఉండగా.. పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (829) థర్డ్ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల లిస్ట్‌లో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (722) టాప్ ర్యాంక్ లో ఉండగా.. బుమ్రా (719), అఫ్గానిస్థాన్ యువ ఆటగాడు ము జీబుర్ రె హ్మన్ (701) రెండు, మూడు ర్యాం కులు సా ధించారు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో ఇండియా నుంచి రవీంద్ర జడేజా (8వ) ఒక్కడే టాప్–10లో చోటు దక్కించుకున్నాడు.

