మోడ్రన్‌‌ క్రికెట్‌‌లో కోహ్లీ-రోహిత్‌‌కు ఎదురులేదు

మోడ్రన్‌‌ క్రికెట్‌‌లో కోహ్లీ-రోహిత్‌‌కు ఎదురులేదు

న్యూఢిల్లీ: మోడ్రన్‌‌ క్రికెట్‌‌లో విరాట్‌‌ కోహ్లీ–రోహిత్‌‌ శర్మ జంటకు ఎదురులేదని శ్రీలంక మాజీ కెప్టెన్ ‌‌కుమార సంగక్కర అన్నాడు. ఇండియా టీమ్‌‌కు వీళ్లద్దరు చాలా ప్రత్యేకమన్నాడు. ‘ప్రతి తరంలో క్రికెట్‌‌ను ఏలే ఓ జంట ఉంటుంది. మా హయాంలో గంగూలీ–ద్రవిడ్‌‌. ఇప్పుడు కోహ్లీ–రోహిత్‌‌. రూల్స్‌‌లో మార్పుల వల్ల వన్డేల్లో స్కోరింగ్‌‌ రేట్ ‌‌పెరిగిందనేది వాస్తవం. కానీ విరాట్‌‌, రోహిత్‌‌ ఆడిన క్రికెట్‌‌ చూస్తే నమ్మశక్యం కాదు. ఈ తరాన్ని ఏలేస్తున్నారు. టీమిండియాకు దొరికిన అద్బుతమైన క్రికెటర్లు ఈ ఇద్దరు. గంగూలీ–ద్రవిడ్‌‌స్థానాలను అలవోకగా భర్తీ చేశారు. రాహుల్‌‌, దాదా సాంప్రదాయ క్రికెటింగ్‌‌ షాట్స్‌‌నే ఆడేవారు. టెక్నికల్‌‌గా చాలా స్ట్రాంగ్‌‌ ప్లేయర్లు. ఈ విషయంలో ద్రవిడ్‌‌ ఒక మెట్టుపైనే ఉంటాడు. అవసరమైనప్పుడు మంచి షాట్స్‌‌ ఆడేవారు. మోడ్రన్ ‌‌ఎరాలో విరాట్‌‌, రోహిత్ ‌‌అలానే ఆడుతున్నారు. ఇద్దరూ సంప్రదాయ  క్రికెటింగ్‌‌ షాట్స్‌‌ఆడతారు. ఫార్మాట్‌‌తో సంబంధం లేకుండా భారీ స్కోర్లు చేస్తున్నారు.ముఖ్యంగా షాట్స్ ‌‌కొట్టేందుకు కండ బలం ఉపయోగించరు. మంచి క్రికెటింగ్‌‌షాట్స్‌‌ ఆడి ఫలితం రాబడతారు. ఈ ఇద్దరూ తెలివైన క్రికెటర్లు’ అని సంగక్కర వివరించాడు.