సెమినార్స్ పోయినయ్.. వెబినార్స్ వచ్చినయ్..

సెమినార్స్ పోయినయ్.. వెబినార్స్ వచ్చినయ్..

కండెక్ట్ చేస్తున్న కాలేజీలు.. ఎక్స్ పర్ట్స్ తో డిజిటల్ కాన్ఫరెన్స్ లు.. ఆన్లైన్లో ఫీజు పేమెంట్
డైలీ ఒక స్టూడెంట్తో సెమినార్
వారం ముందు నుంచే ప్రిపరేషన్

హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ ఎఫెక్ట్ తో కాలేజీలు ఆన్ లైన్ వీడియో క్లాసులతోపాటు వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాయి. కంప్లీట్ అయిన చాప్టర్స్ స్టూడెంట్స్ కి ఎంతవరకు అర్థమయ్యాయే తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం. వివిధ రకాల లెర్నింగ్ యాప్ ల ద్వారా వెబినార్స్ కండెక్ట్ చేస్తున్నట్లు లెక్చరర్లు చెప్తున్నారు. తాము సెమినార్ ఇవ్వడంతోపాటు డైలీ ఒక స్టూడెంట్ తో లెసన్స్ ఎక్స్ ప్లెయిన్ చేపిస్తున్నామంటున్నారు. ఈ వెబినార్స్ తోపాటు సిటీలో డిజిటల్ కాన్ఫరెన్స్ లు కూడా జరుగుతున్నాయి. పలువురు ఎక్స్ పర్స్ట్ ఒక్క రోజు నుంచి నెల రోజుల కోర్సుల వరకు ఆన్ లైన్ వేదికగా కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు.

ప్రాక్టికల్ గా అర్థమయ్యేలా..
వీడియో కాల్స్ ద్వారా ఎంత వివరించి చెప్పినా చాలామంది స్టూడెంట్స్ కి అర్థం అవుతుందో.. లేదో తెలియడం లేదని, అందుకే ప్రతి వారం వెబినార్స్ నిర్వహిస్తున్నామని లెక్చరర్స్ చెప్తున్నారు. వాటి కోసం వారం ముందు నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ పెట్టుకుంటున్నారు. స్టూడెంట్స్ కి టాపిక్స్ చెప్పి ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. సెమినార్ టైంలో వాటిని చూపిస్తూ స్టూడెంట్స్ ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నారు. జూమ్ యాప్, వెబ్ సైట్స్ ద్వారా వాటిని కండెక్ట్ చేస్తున్నారు. 30 నిమిషాల నుంచి గంట వరకు ఈ వెబినార్స్ జరుగుతున్నాయి. ముందుగా యాప్ లో స్టూడెంట్స్ ని యాడ్ చేసి, వారికి లింక్ సెండ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ లాగిన్ అయ్యాక సెమినార్ స్టార్ట్ అవుతుంది.

ఆన్ లైన్ కాన్ఫరెన్స్ లు
మెడికల్ స్టూడెంట్స్ కి ఎక్కువగా ఆన్ లైన్ కాన్ఫరెన్స్ లు జరుగుతున్నాయి. సర్టిఫైడ్ ట్రైనర్స్ వీటిని కండక్ట్ చేస్తున్నారు. టాపిక్, ట్రైనర్స్ ని బట్టి 100 నుంచి రూ.లక్షల్లో ఫీజులు ఉంటున్నాయి. కాన్ఫరెన్స్ జరగనున్నట్లు కాలేజీకి ఇన్ఫర్మేషన్ వస్తే లెక్చరర్స్ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఆన్లైన్లో ఫీజు పే చేసి అటెండ్ అవుతున్నారు. స్టూడెంట్స్ సర్టిఫికెట్తో పాటు థియరిటికల్ నాలెడ్జ్ పొందే చాన్స్ ఉందని లెక్చరర్స్ చెప్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నతర్వాత ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.

టెక్నికల్ ఇష్యూస్..
డైరెక్ట్ సెమినార్ లో స్టూడెంట్స్ కి ఏం డౌట్స్ ఉన్నా అడిగే వీలుంటుంది. వెబినార్స్ లో ఆ చాన్స్ ఉండటం లేదని లెక్చరర్స్ అంటున్నారు. సెమినార్ లింక్ ని క్లాస్ కో ఆర్డినేటర్ ద్వారా స్టూడెంట్ గ్రూప్ లో పోస్ట్ చేయిస్తున్నామని చెప్పారు. సెమినార్ మధ్యలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ నుంచి యాడ్ చేయాలనే మెసేజ్లు, మిస్ అయింది మళ్లీ చెప్పాలనే రిక్వెస్ట్లు వస్తున్నాయని తెలిపారు. కొంతమంది స్టూడెంట్స్ నెట్ వర్క్ లేదని, ఊళ్లో ఉన్నామని చెప్తున్నట్లు తెలిపారు. అందరినీ కోఆర్డినేట్ చేసుకుని సెమినార్స్ కండెక్ట్ చేయడం టెక్నికల్ గా ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు.

కొత్త ఎక్స్ పీరియన్స్
క్లాస్ రూమ్ లో సెమినార్ ఇవ్వడం వేరు, వెబినార్లో పార్టిసిపేట్ చేయడం వేరు. లెక్చరర్స్ చెప్పిన పీపీటీని అర్థం చేసుకుని, టాపిక్స్ నోట్ చేసుకోవాలి. ఇప్పటివరకు నేను మూడు వెబినార్స్ ఇచ్చాను. మాకు ముందే ఒక టాపిక్ ఇస్తారు, షెడ్యూల్ ప్రకారం వచ్చిన రోజు అది చెప్పాలి. ఈ ఎక్స్ పీరియన్స్ కొంచం కొత్తగా ఉంది.
– శ్రీజ కంటిపూడి, ఫిజియోథెరపీ స్టూడెంట్

షెడ్యూల్ ప్రకారమే..
యూనివర్సిటీ ఆర్డర్స్ ప్రకారమే వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఫోర్త్, థర్డ్, సెకండ్ ఇయర్ వాళ్లకి నిర్వహిస్తున్నాం. అంతా ముందు నుంచి ఉన్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. చెప్పిన లెస్సెన్స్ పిల్లలకు ఎంతవరకు అర్థం అయ్యాయో
తెలుసుకోగలుగుతున్నాం. స్టూడెంట్తో డయాగ్రామ్స్ వేయించి వివరించమని అడుతున్నాం.
– విజయ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అపోలో మెడికల్ కాలేజ్

For More News..

రైతులకు శుభవార్త.. కిరాయికి సాగు పనిముట్లు

సీనియర్ను కాల్చిచంపి.. తనూ కాల్చుకున్నడు

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్

యూఎస్ సర్కార్‌‌‌‌పై ఇండియన్ మహిళ కేసు