ఉద్యోగుల కోసం 24/7 కరోనా కేర్ పోర్టల్

 ఉద్యోగుల కోసం 24/7 కరోనా కేర్ పోర్టల్
  • ప్రారంభించిన వెర్ట్యూసా కార్పొరేషన్

కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో ఉద్యోగులకు భద్రత అందేలా సాయపడడానికి 24/7 నిరాటంకంగా పనిచేసే కరోనా కేర్ పోర్టల్ నున  వెర్ట్యూసా కార్పొరేషన్ అందుబాటులోకి తెచ్చింది. వ్యక్తిగతమైన ఫీచర్లతో రూపొందించిన  కొవిడ్- 19 కేర్ పోర్టల్‌ ప్రతి టీమ్ సభ్యుడు వారి కుటుంబాల పట్ల వ్యక్తిగతమైన దృక్పథం ఉంటుందని.. ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టకుండా చూసుకుంటుందని వెర్ట్యూసా కార్పొరేషన్ ప్రకటించింది. లాగ్ అయిన అన్ని ప్రశ్నలనూ, వ్యాక్సినేషన్లకు సంబంధించి టీమ్ సభ్యుల డేటానూ పోర్టల్, కాల్ సెంటర్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయని సంస్థ చెబుతోంది. పోర్టల్‌తో పాటు, విస్తృత శ్రేణిలో కొవిడ్-19 సంరక్షణ, సేవలను అందించడం కోసం ఒక వార్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, తమ ఇళ్ళలోని భద్రత నుంచి అత్యుత్తమ స్థాయి ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడం దీని ఉద్దేశం” అని వెర్ట్యూసా చీఫ్ పీపుల్ ఆఫీసర్ నారాయణన్ పేర్కొన్నారు.