విశాక ఆటమ్​ లైఫ్​ స్టార్ట్​

విశాక ఆటమ్​ లైఫ్​ స్టార్ట్​

హైదరాబాద్​, వెలుగు: పర్యావరణానికి ఉపయోగపడే బిల్డింగ్​ మెటీరియల్స్​తయారు చేసే విశాక ఇండస్ట్రీస్‌,  ‘ఆటమ్​లైఫ్​’ పేరుతో సస్టైనబుల్ ఎక్స్​పీరియన్స్​ సెంటర్​ను సికింద్రాబాద్​లోని ఎస్​పీ రోడ్డులో స్టార్ట్​ చేసింది. సబ్బులు, షాంపూలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్​ వరకు సర్టిఫైడ్​ సస్టైనబుల్​ప్రొడక్టులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సస్టైనబుల్ ప్రొడక్టులను తయారు చేసే స్టార్టప్​లకు కూడా చేయూత ఇస్తామని ఆటమ్​ లైఫ్​ ప్రకటించింది. ఈ సందర్భంగా విశాక ​ జాయింట్​ ఎండీ వంశీ గడ్డం మాట్లాడుతూ ‘‘సాధారణ ప్రొడక్టుల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. భవిష్యత్​కు మెరుగైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వెంచర్​ను మొదలుపెట్టాం. మనం ఇలాగే ప్రకృతిని నాశనం చేస్తూ పోతే రాబోయే తరాలకు ఏమీ మిగలదు. పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచనతోనే ఆటమ్ లైఫ్​ను స్టార్ట్​ చేశాం. సస్టైనబిలిటీ అంటే చాలా మందికి అర్థం కాదు. పర్యావరణానికి హాని చేయని జీవన విధానాన్ని అలవర్చుకోవడమే సస్టైనబిలిటీ! ఈ ఏడాదిలోపు అన్ని మెట్రో సిటీల్లో ఆటమ్​లైఫ్​ స్టోర్లను తెరుస్తాం. వీటికి కరెంటును మా కంపెనీ తయారు చేసే ఆటమ్​ సోలార్​ రూఫ్​ ద్వారా తీసుకుంటాం”అని ఆయన వివరించారు.