
ఎనిమిదేండ్లకు సైకిల్ తొక్కడం, పన్నెండేండ్లకే బైక్ నడపడం నేర్చుకుంది. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్లకు తెలియకుండా నాన్న బైక్ తీసుకెళ్లి నడిపేది. కొన్నిసార్లు కిందపడి గాయాలు కూడా అయ్యాయి. ఆమెకు రైడింగ్ మీదున్న ప్రేమని చూసి వాళ్ల అమ్మ నగలమ్మి మరీ బైక్ కొనిచ్చింది. అలా మొదలైన విశాఖ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ దాటుకుని ఇప్పుడు దేశంలోనే మొదటి మహిళా మోటోవ్లాగర్‌గా పేరుతెచ్చుకుంది. ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది.
విశాఖ ఫుల్సుంగే 1993 నవంబర్ 3న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి ధనరాజ్, తల్లి మోహినీ. విశాఖ హోలీ హై స్కూల్‌లో చదివింది. తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో బీబీఏ(ఇంటర్నేషనల్ ఫైనాన్స్)లో చేరింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ (ఇంటర్నేషనల్ మార్కెటింగ్) పూర్తి చేసింది. ఆమెకు చిన్నప్పటినుంచి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది అబ్బాయిలే ఉండడంతో వాళ్లతో కలిసి రైడింగ్ నేర్చుకుని, వ్లాగింగ్ ప్రయాణం మొదలుపెట్టింది. ఆ జర్నీ గురించి ఆమె మాటల్లోనే..
బైక్‌లంటే ఇష్టం
చిన్నప్పుడు నాన్న బైక్ మీద ముందు సీటులో కూర్చోవడం నాకు చాలా ఇష్టం. నేను బైక్ హ్యాండిల్ పట్టుకుంటే.. నా చేతులమీది నుంచి నాన్న పట్టుకుని బైక్ నడిపేవాడు. అప్పుడు నాకు నేనే నడుపుతున్నట్టు అనిపించేది. అలా రైడింగ్ మీద ఇంట్రస్ట్ పెరుగుతూ వచ్చింది. పెద్దయ్యాక బైక్ రైడర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కనేదాన్ని. చదువుపూర్తయ్యాక చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంతృప్తి లేకపోవడంతో మానేశా. గూగుల్‌లో రైడింగ్‌కి సంబంధించిన జాబ్స్ గురించి వెతికా. అలాంటిది ‘పిజ్జా డెలివరీ’ పని మాత్రమే అని తెలిసింది.
కానీ.. అందులో చేరడం ఇష్టం లేక ఉద్యోగం చేయాలనే ఆలోచన మానుకున్నా. కొన్ని రోజులు బాగా రీసెర్చ్ చేస్తే ‘మోటోవ్లాగింగ్’ చేస్తూ డబ్బు సంపాదించవచ్చని తెలిసింది. పైగా అది నాకు నచ్చిన పని. అందుకే ఆ వైపు అడుగులు వేశా. చివరకు మూడేండ్ల తర్వాత యూట్యూబ్‌లో మొదటి వ్లాగ్ అప్‌లోడ్ చేసి, మోటో వ్లాగర్ అయిపోయా.
ఎన్నో సవాళ్లు
వ్లాగింగ్ మొదలుపెట్టిన కొత్తలో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మోటోవ్లాగింగ్ చేయడానికి సరైన గేర్, బైక్, కెమెరా అవసరం. కేవలం హెల్మెట్, జాకెట్ కొనడానికే రూ. 25 వేలు కావాలి. నాకు నచ్చిన డ్యూక్ బైక్ ధర రూ. 3 లక్షలు. వాటిని కొనేంత కాదు కదా.. డౌన్ పేమెంట్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బులేదు. అప్పుడు మా అమ్మ తన నగలమ్మి కొంత డబ్బు ఇచ్చింది. దాంతో డౌన్‌పేమెంట్ చేసి, మిగతాది ఈఎంఐల రూపంలో చెల్లించా. అప్పటినుంచి రెగ్యులర్‌గా బైక్ రైడింగ్ పోటీలకు వెళ్లేదాన్ని. అబ్బాయిలు చేసే పని అమ్మాయి చేస్తే సాధారణంగానే చాలామంది హేళన చేస్తారు.
నన్ను కూడా మొదట్లో ఎంతోమంది ట్రోల్ చేశారు. నేను దేశంలోని మొట్టమొదటి స్వయం ప్రకటిత మహిళా మోటోవ్లాగర్ అని వెక్కిరించారు. అందుకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు రిక్వెస్ట్ పంపా. వాళ్లు రీసెర్చ్ చేసి నాకంటే ముందు దేశంలో ఏ అమ్మాయి మోటోవ్లాగింగ్ చేయలేదని నిర్ధారించి నాకు ఆ టైటిల్ ఇచ్చారు.
బైక్‌లంటే ఇష్టం
చిన్నప్పుడు నాన్న బైక్ మీద ముందు సీటులో కూర్చోవడం నాకు చాలా ఇష్టం. నేను బైక్ హ్యాండిల్ పట్టుకుంటే.. నా చేతులమీది నుంచి నాన్న పట్టుకుని బైక్ నడిపేవాడు. అప్పుడు నాకు నేనే నడుపుతున్నట్టు అనిపించేది. అలా రైడింగ్ మీద ఇంట్రస్ట్ పెరుగుతూ వచ్చింది. పెద్దయ్యాక బైక్ రైడర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కనేదాన్ని. చదువుపూర్తయ్యాక చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంతృప్తి లేకపోవడంతో మానేశా. గూగుల్‌లో రైడింగ్‌కి సంబంధించిన జాబ్స్ గురించి వెతికా.
అలాంటిది ‘పిజ్జా డెలివరీ’ పని మాత్రమే అని తెలిసింది. కానీ.. అందులో చేరడం ఇష్టం లేక ఉద్యోగం చేయాలనే ఆలోచన మానుకున్నా. కొన్ని రోజులు బాగా రీసెర్చ్ చేస్తే ‘మోటోవ్లాగింగ్’ చేస్తూ డబ్బు సంపాదించవచ్చని తెలిసింది. పైగా అది నాకు నచ్చిన పని. అందుకే ఆ వైపు అడుగులు వేశా. చివరకు మూడేండ్ల తర్వాత యూట్యూబ్‌లో మొదటి వ్లాగ్ అప్‌లోడ్ చేసి, మోటో వ్లాగర్ అయిపోయా.
వింతగా చూశారు
నేను ఎప్పుడూ బైక్‌పై తిరుగుతూ, కెమెరాతో మాట్లాడుతూ ఉండటం చూసి ప్రజలు మొదట నన్ను వింతగా చూశారు. యూట్యూబ్‌లో నాకు ఫాలోవర్స్ పెరిగిన తర్వాత ఎప్పుడూ అలాంటి సమస్య రాలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నన్ను చాలా మంది గుర్తుపడుతున్నారు. నా దగ్గరకు వచ్చి నా వీడియోలను చూస్తున్నామని చెప్తుంటారు. కొంతమంది నాతో సెల్ఫీలు కూడా తీసుకుంటుంటారు. నేను ఎక్కడికి వెళ్లినా నాతోపాటు రైడింగ్ గేర్, అత్యవసర పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి కొంత డబ్బు తీసుకెళ్తా. నా ప్రతి బైక్ మీద నా బ్లడ్ గ్రూప్ రాసి ఉంటుంది. మొబైల్ స్క్రీన్‌పై ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ డిస్‌ప్లే అయ్యేలా వాల్‌పేపర్ పెట్టుకున్నా. వాటితోపాటు ట్రాకింగ్, యాక్సిడెంట్ డివైజ్‌లు కూడా వెంట తీసుకెళ్తుంటా.
లక్షల మంది ఫాలోవర్లు
విశాఖ 2017 ఫిబ్రవరి 5న తన యూట్యూబ్ చానెల్ ‘‘రైడర్ గర్ల్ విశాఖ’’ను ప్రారంభించింది. మరుసటి రోజు తన మొదటి వీడియోను అప్‌లోడ్ చేసింది. మొదట్లో పెద్దగా వ్యూస్ రాలేదు. కానీ.. కొన్నాళ్లకు చానెల్‌కు రీచ్ పెరిగింది. దాంతో ఆమెని ఇప్పుడు చాలామంది తన చానెల్ పేరుతోనే పిలుస్తున్నారు. ఎక్కువగా సోలో ట్రావెల్, అడ్వెంచర్‌లు, రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్, లైఫ్‌స్టయిల్ వీడియోలు చేస్తుంటుంది. ప్రస్తుతం చానెల్‌లో వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి. చానెల్‌ని 1.1 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు.
ఐదు రికార్డ్స్
విశాఖ ఇప్పటివరకు ఐదు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సాధించింది. వాటిలో దేశంలో మొదటి మహిళా మోటోవ్లాగర్‌గా, బే ఆఫ్ బెంగాల్‌ను దాటి అండమాన్ దీవుల్లో రైడ్ చేసిన మొదటి మహిళా రైడర్‌గా సాధించిన రికార్డులు ఆమెకు ఎంతో గుర్తింపుని తీసుకొచ్చాయి. 2016లో కేటీఎం సర్క్యూట్ రేస్‌లో అత్యంత వేగవంతమైన గర్ల్ రైడర్‌గా నిలిచింది. 2017లో ముంబై నుంచి లేహ్ లడఖ్ వరకు 25 రోజుల సోలో బైక్ ట్రిప్ చేసింది. 2020లో 4,600 కి.మీ. ‘నర్మదా పరిక్రమ రైడ్’ చేసి ‘‘సేవ్ రివర్ సేవ్ నేషన్”సందేశాన్ని ఇచ్చింది.
టీవీఎస్ ఎక్స్‌బిట్ మ్యాగజైన్‌లో టాప్ 10 ఆటోమొబైల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఒకరిగా నిలిచింది. 2023లో నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ట్రెక్కింగ్ చేసింది. ఆమె దగ్గర ప్రస్తుతం కేటీఎం డ్యూక్ 390, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, బజాజ్ పల్సర్ 220 లాంటివి ఉన్నాయి. ఇప్పటివరకు లేహ్ లడఖ్ (మూడుసార్లు), స్పితి, రాజస్థాన్, కన్యాకుమారి, కేరళ, రామేశ్వరం, గోవా, గుజరాత్, ఢిల్లీ , పంజాబ్, మహారాష్ట్రతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాకు వెళ్లింది. ప్రస్తుతం యూట్యూబ్‌తోపాటు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తోంది విశాఖ.
ఇన్‌ఫ్లుయెన్సర్‌గా..
విశాఖకు యూట్యూబ్‌తోపాటు మిగతా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 9.79 లక్షలు, ఫేస్‌బుక్‌లో 2 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ‘‘గేమర్‌గర్ల్” పేరుతో మరో యూట్యూబ్ చానెల్ కూడా పెట్టింది. కాకాపోతే అందులో పెద్దగా వీడియోలు అప్‌లోడ్ చేయలేదు. ఆమె యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌గా కూడా పనిచేస్తోంది.